బస్టాండ్‌లో బంగారం చోరీ
ABN, Publish Date - Dec 27 , 2024 | 11:38 PM
వికారాబాద్ బస్టాండ్‌లో చోరీ జరిగింది. బస్సు ఎక్కుతున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వికారాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ బస్టాండ్‌లో చోరీ జరిగింది. బస్సు ఎక్కుతున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని శివరాంనగర్ కాలనీకి చెందిన భ్రమరాంబ శుక్రవారం మధ్యాహ్నం 1.30గంటలకు వికారాబాద్ నుంచి సదాశివపేటలో ఉండే కూతురు వద్దకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు మెడలో ఉన్న రెండు తులాల బంగారాన్ని దొంగలించారు. దీంతో బాధితురాలు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్సును ఆపి తనిఖీలు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు దుండగులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - Dec 27 , 2024 | 11:38 PM