ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ABN, Publish Date - Dec 31 , 2024 | 11:51 PM
మండల కేంద్రంలోని పెంజర్ల రోడ్డులో నివాసం ఉంటున్న వెంకటేష్(58) అనే వ్యక్తి సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై వెంకటేష్ తెలిపారు. వెల్డింగ్ పనులు చేసి జీవనం కొనసాగిస్తున్న వెంకటేష్ కొన్ని సంవత్సరాలుగా భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ, అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
కొత్తూర్, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పెంజర్ల రోడ్డులో నివాసం ఉంటున్న వెంకటేష్(58) అనే వ్యక్తి సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై వెంకటేష్ తెలిపారు. వెల్డింగ్ పనులు చేసి జీవనం కొనసాగిస్తున్న వెంకటేష్ కొన్ని సంవత్సరాలుగా భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ, అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో జీవితం మీద విరక్తి చెందిన వెంకటేష్ ఇంట్లో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వెంకటేష్ కుమారుడు జగదీష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై చెప్పారు.
Updated Date - Dec 31 , 2024 | 11:51 PM