భూములిచ్చిన రైతులకు ఇళ్ల పట్టాలిస్తాం
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:46 AM
ముచ్చర్లలో నెలకొల్పే ఫోర్త్ సిటీకి భూములిచ్చిన రైతులందరికీ ఎకరానికి ఒక గుంట చొప్పున ఇంటి స్థలం ఇస్తామని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం వంద మంది మీర్కాన్‌పేట రైతులు తుక్కుగూడలోని క్యాంప్ కార్యాలయంలో లక్ష్మారెడ్డిని కలిసి సమస్యలను వివరించారు.
మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
కందుకూరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ముచ్చర్లలో నెలకొల్పే ఫోర్త్ సిటీకి భూములిచ్చిన రైతులందరికీ ఎకరానికి ఒక గుంట చొప్పున ఇంటి స్థలం ఇస్తామని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం వంద మంది మీర్కాన్‌పేట రైతులు తుక్కుగూడలోని క్యాంప్ కార్యాలయంలో లక్ష్మారెడ్డిని కలిసి సమస్యలను వివరించారు. వారితో కేఎల్లార్ మాట్లాడుతూ.. మీర్కాన్‌పేట 112సర్వే నంబరులో 844 ఎకరాలను ప్రభుత్వం సేకరించిందన్నారు. అయితే ఇంకా 86 ఎకరాల విస్తీర్ణానికి రైతులకు పరిహారం ఇవ్వలేదని రైతులు చెబుతున్నారని తెలిపారు. అసైన్డ్‌భూములు కోల్పోయిన రైతులకు ఇంటి స్థలాల పట్టాలిస్తామని భరోసా ఇచ్చారు. గ్రీన్‌ఫార్మసిటీకి భూములిచ్చిన రైతులకు ఇప్పటికే మీర్కాన్‌పేట, పంజగూడ, తిమ్మాయపల్లి పరిధిలో 600 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ లేఅవుట్లలో ప్లాట్లను ఇస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే రైతులకు ప్లాట్ల డాక్యుమెంట్లు ఇస్తామన్నారు. అలాగే పరిహారం అందని మీర్కాన్‌పేట రైతుల వివరాలపై అధికారులతో మాట్లాడి 86 ఎకరాలకు పరిహారం, ప్లాట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు జంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ బి.జంగారెడ్డి, ఎ.సత్యనారాయణ, కె.మధన్‌పాల్‌రెడ్డి, డి.నర్సింహ, బి.బాల్‌రాజ్, పి.శంకర్, జంగయ్య, డి.విష్ణు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 12:46 AM