అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:16 AM
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదవారి సొంతింటికల నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రాలో ్లఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికి మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చౌదరిగూడ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదవారి సొంతింటికల నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రాలో ్లఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికి మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
చౌదరిగూడ కార్యదర్శిపై ఎమ్మెల్యే ఆగ్రహం
జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ఆన్‌లైన్ ప్రక్రియ అసంపూర్తిగా కొనసాగుతుండడంతో పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తున్నావ్? ఎందుకు ఆలస్యం అవుతుంది? చౌదరిగూడలో 500 ఇళ్లకు గాను 100 ఇళ్లను ఆన్‌లైన్ చేయడం ఏంటి? ఇంకా నాలుగు రోజులే ఉంది.. ఎలా పూర్తి చేస్తావ్.. అంటూ పంచాయతీ కార్యదర్శి పాండురంగం గౌడ్ పై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల సమన్వయంతో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లేడ్ చౌదరిగూడ మండలాధ్యక్షుడు రాజు, కొందుర్గు మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు చంద్రశేఖర్, పురుషోత్తంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రుచికరమైన వంటకాలను అందించాలి
షాద్‌నగర్ : హోటళ్లకు వచ్చే వినియోగదారులకు రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. గురువారం షాద్‌నగర్ పట్టణ శివారులో బి.వెంకట్‌రెడ్డి అనే హోటల్ వ్యాపారి కొత్తగా ఏర్పాటు చేసిన బాబా గ్రాండ్ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. కేవలం ధనార్జన కోసమే హోటళ్లను ఏర్పాటు చేసి రుచికరమైన వంటకాలు అందించకపోతే పెట్టుబడి కూడా రాక వాటిని మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఏఎంసీ వైస్‌చైర్మన్ బాబర్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:16 AM