ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జేసీబీ వచ్చేసింది!

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:00 AM

మున్సిపాలిటీకి చెందిన జేసీబీ ఎట్టకేలకు వచ్చేసింది. ఆర్నేళ్ల తర్వాత శనివారం ఉదయం మున్సిపాలిటీకి జేసీబీ చేరుకుంది.

తాండూరు మున్సిపాలిటీకి చేరిన జేసీబీ

తాండూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీకి చెందిన జేసీబీ ఎట్టకేలకు వచ్చేసింది. ఆర్నేళ్ల తర్వాత శనివారం ఉదయం మున్సిపాలిటీకి జేసీబీ చేరుకుంది. ఆంధ్రజ్యోతిలో జేసీబీపై వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనాలతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి గతంలో ఆరా తీస్తూ జేసీబీ తెప్పించాలని కమిషనర్‌ను ఆదేశించారు. పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌ను జేసీబీ ఎక్కడ ఉందని, వెంటనే తెప్పించాలని ఒత్తిడి చేశారు. దీంతో కమిషనర్‌ విక్రం సింహారెడ్డి ఇంజనీర్‌ విభాగానికి చెందిన డీఈ, ఏఈలను ఆదేశిస్తూ వెంటనే జేసీబీకి సంబంధించిన బిల్లులు క్లియర్‌ చేస్తూ జేసీబీని తెప్పించాలని ఆదేశించారు. జేసీబీ మరమ్మతులకు హైదరాబాద్‌లోని వెంకట్‌సాయి మోటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మెకానిక్‌ షెడ్డుకు తీసుకెళ్లగా అక్కడ బిల్లులు చెల్లించక ఆర్నెళ్లుగా అక్కడే ఉందని తెలిపారు. జేసీబీ మరమ్మతులకు రూ.5లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఈ వివరాలను తెలిపేందుకు అధికారులు నిరాకరించారు. జేసీబీ తాండూరుకు రప్పించడంలో ఆంధ్రజ్యోతి కృషిఉందని కౌన్సిలర్‌ సంగీత ఠాకూర్‌, ముక్తార్‌ నాజ్‌, కౌన్సిలర్లు అభినందించారు.

Updated Date - Dec 22 , 2024 | 12:01 AM