ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాళం వేసిన ఇంటికి కన్నం

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:29 PM

దైవ దర్శనానికి వెళ్లిన వారి ఇంట్లో దొంగలు చొరబడి రూ.3లక్షల నగదుతో పాటు 2 తులాల బంగారం, 80 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

రూ.3లక్షలు, బంగారం, వెండి ఆభరణాలు అపహరణ

కుటుంబ సభ్యులు దైవ దర్శనానికి వెళ్లడంతో ఇల్లు గుల్ల

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

చేవెళ్ల/శంకర్‌పల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): దైవ దర్శనానికి వెళ్లిన వారి ఇంట్లో దొంగలు చొరబడి రూ.3లక్షల నగదుతో పాటు 2 తులాల బంగారం, 80 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్‌నకు చెందిన వీరయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు వెళ్లారు. శనివారం మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.3లక్షల నగుదు, 2 తులాల బంగారు ఆభరణాలు. 80 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. అయితే, ఇంటితాళం పగులగొట్టి డోర్లు తెరిచి ఉండడం గమనించిన పక్కింటి వారు.. వీరయ్యకు, పోలీ్‌సలకు సమాచారం అందించారు. దాంతో బాఽధిత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని చూడగా బీరువాలో నగదు, బంగారం, వెండి కన్పించలేదు. పోలీ్‌సలు క్లూస్‌ టీంను రప్పించి వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీ్‌సలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు.

Updated Date - Dec 28 , 2024 | 11:29 PM