ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Traffic Police: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడ్డ వారిని పోలీసులు ఏం చేశారో చూడండి...

ABN, Publish Date - Jul 25 , 2024 | 04:06 PM

Telangana: మద్యం సేవించి వాహనాలు నడుపరాదు అంటూ పోలీసులు ఎప్పటిప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీకెండ్‌లలో అయితే పలు చోట్ల చెక్‌పోస్టులు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకుని... వారికి కౌన్సిల్ ఇస్తుంటారు.

Traffic Police Misbehavior

రంగారెడ్డి, జూలై 25: మద్యం సేవించి వాహనాలు నడుపరాదు అంటూ పోలీసులు(Telangana Police) ఎప్పటిప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీకెండ్‌లలో అయితే పలు చోట్ల చెక్‌పోస్టులు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని పట్టుకుని... వారికి కౌన్సిల్ ఇస్తుంటారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని చేవెళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు.

MP Lavu Srikrishnadevarayalu: పల్నాడులో పరిస్థితి మరింత దారుణం..


డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారిపై దాడి చేస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గరలో శంకర్‌పల్లికి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోంగార్డ్ కేశవ్‌లు ముగ్గురు కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తులను ఆపిన పోలీసులు వారిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. వారిని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై చేయి చేసుకోవడమే కాకుండా.. బూతులు తిడుతూ రెచ్చిపోయారు.

Telangana: గేమ్ స్టార్ట్.. కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్..


పోలీసుల దాడిని ఫోన్‌లో చిత్రీకరించడానికి యత్నించిన వ్యక్తిపై కూడా ఓ పోలీసు చేయి చూసుకున్నాడు. సదరు వ్యక్తులను ట్రాఫిక్ పోలీసులు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాళ్లను చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. తప్ప కొడుతూ, తన్నుతూ, దుర్భాషలాడుతూ ప్రజలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై పై అధికారులు స్పందించి చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోమ్ గార్డ్ కేశవ్‌లపైన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Home Minister Anitha: గంజాయి మత్తులో అనేక దారుణాలు..

KCR: ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2024 | 04:52 PM

Advertising
Advertising
<