ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా రథోత్సవం

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:11 AM

వేముల్‌నర్వ గ్రామ పంచాయతీ నంబయ్య గుట్టపై వెలసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రథోత్సవంలో భక్తుల సంబురాలు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

కేశంపేట, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వేముల్‌నర్వ గ్రామ పంచాయతీ నంబయ్య గుట్టపై వెలసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్‌ దేవాలయం నుంచి నంబయ్య గుట్ట వరకు రథోత్సవం సాగింది. రుక్ముణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి కోలాటాల నడుమన నంబయ్య దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు మంజుల, మల్లేష్‌, పర్వత్‌రెడ్డి, అనురాధ, మనోహర్‌ గౌడ్‌, చిర్ర శీను, చిర్ర చంద్రయ్య, గాండ్ల అశోక్‌ కుమార్‌, రమేష్‌, ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:11 AM