ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

షుగర్‌ టెన్షన్‌... బీపీ భయం

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:41 PM

ఉరుకుల పరుగుల జీవన ప్రయాణంలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఉద్యోగ, వృత్తి రంగాల్లో పోటీ పడి రాణించేందుకు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. సమయం లేదనే సాకుతో జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి బీపీ, షుగర్‌ తదితర వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు.

జిల్లాలో పెరుగుతున్న బాధితులు

పురుషుల్లో రక్తపోటు.. మహిళల్లో మధుమేహం అధికం

పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా సమస్య

ఆస్పత్రుల్లో టెల్మిసార్టన్‌ 40ఎంజీ టాబ్లెట్ల కొరత

ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు పరుగులు

ఉరుకుల పరుగుల జీవన ప్రయాణంలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఉద్యోగ, వృత్తి రంగాల్లో పోటీ పడి రాణించేందుకు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. సమయం లేదనే సాకుతో జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి బీపీ, షుగర్‌ తదితర వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం, పొగాకు, మద్యం తదితర అలవాట్లతో రక్తపోటు, మధుమేహం ఎటాక్‌ అయ్యి నరకం అనుభవిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం చేయడం వలన నేడు ఈ వ్యాధులను తగ్గించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జనవరి నుంచి డిసెంబరు వరకు 13,75,409 మంది బీపీ, షుగర్‌కు సంబంధించిన కేసులు రిజిస్టర్‌ కాగా, అందులో 1,64,239 మందిని పరిశీలించారు. ఈ పరిశీలనలో 95,238 మందికి రక్తపోటు ఉన్నట్లు తేలింది. అందులో మహిళల కంటే.. పురుషుల్లోనే అధికంగా అధిక రక్తపోటు బారిన పడ్డారు. అలాగే 47,591 మంది షుగర్‌ బారిన పడగా అందులో మహిళలే అధికంగా ఉన్నారు. బీపీ, షుగర్‌ అనేవి చాలా సాధారణంగా మారిపోయాయి. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా పల్లెల్లోనూ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతీ పది మందిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతీ ఎనిమిది మందిలో ఒకరికి షుగర్‌ ఉంటున్న పరిస్థితి ఉందంటే.. ఈ సమస్యల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో 26 శాతం, పట్టణాల్లో 30 శాతం బీపీ బాధితులున్నారని అంచనా. అదే షుగర్‌ విషయానికొస్తే పల్లెల్లో 19 శాతం, పట్టణాల్లో 24 శాతం బాధితులున్నారు. జీవనశైలి కారణంగా తలెత్తే ఈ సమస్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చర్యలు తీసుకుంటోంది. రక్తపోటును ఏమాత్రం ని ర్లక్ష్యం చేసినా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యు లు హెచ్చరిస్తున్నారు. డయాబెటీస్‌(షుగర్‌)తోనూ అనేక మంది అవస్థ పడుతున్నారు.

తీవ్ర ఒత్తిడితో..

కంప్యూటర్‌ సంబంధిత ఉద్యోగాలు చేసే వారు, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఉద్యోగాల వేటలో ఒత్తిడికి లోనవుతున్న వారు, ఆహార అలవాట్లు, శారీరక శ్ర మ లేకపోవడం తదితర కారణాలతో బీపీ, షుగర్‌ వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 50ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ మంది బీపీతో బాధపడుతున్నట్లు తేలింది. వీరికి వైద్యారోగ్యశాఖ ప్రతీనెలా మందు లు పంపిణీ చేస్తోంది. డయాబెటీస్‌ జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. వంశపారంపర్యంగా లేదా మానసిక ఒత్తిడి, జంక్‌ ఫుడ్‌ తినడం, సరైన వ్యా యామం లేకపోవడం, పొగాకు, మద్యం వంటి వ్య సనాలు ఉన్నవారికి ఎక్కువగా షుగర్‌ వస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కొండాపూర్‌లో ఎన్‌సీడీ క్లినిక్‌

జిల్లా ఆస్పత్రిలో కొత్తగా ఎన్‌సీడీ క్లినిక్‌ను ఏర్పా టు చేశారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, వృ ద్ధాప్యసేవలు, మానసిక సమస్యలు, కిడ్నీ, కాలేయ సమస్యలు, నోటి సమస్యలకు చికిత్స అందిస్తారు. బీపీ, షుగర్‌ వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక డాక్టర్‌ను నియమించారు.

బీపీ మాత్రల కొరత

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెల్మిసార్టన్‌ 40 ఎంజీ ట్యాబ్లెట్స్‌ తీవ్ర కొరత ఏర్పడింది. షుగర్‌ ట్యాబ్లెట్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ బీపీ మాత్రలు మాత్రం అందుబాటులో లేవు. గత రెండు నెలలుగా బీపీ ట్యాబ్లెట్స్‌ రోగులకు అరకొర అందుతున్నాయి. పేషెంట్‌కు నెల మొత్తం సరిపోయే విధంగా ఇవ్వాల్సి ఉండగా ఐదు, పది ఇస్తున్నారు. ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు సరఫరా తగ్గింది. ఇండెంట్‌ పెట్టినా? సరిపడా రావడం లేదని ఫార్మసిస్టులు చెబుతున్నారు. పలు ఏరియా ఆస్పత్రుల్లో బయట నుంచి కొని రోగులకు సరఫరా చేస్తున్నారు. బీపీ మాత్రలతో పాటు బీ-12 ఇంజక్షన్లు కొరత ఏర్పడ్డాయి. బీపీ వ్యాధిగ్రస్తులు బయట మెడికల్‌ షాపుల్లో టెల్మిసార్టన్‌ 40 ఎంజీ టాబ్లెట్స్‌ కొనుక్కుంటున్నారు. ప్రభుత్వం బీసీ టాబ్లెట్స్‌ను పూర్తి స్తాయిలో సరఫరా చేయాలని కోరుతున్నారు.

జీవన శైలిని మార్చుకోవాలి

జీవనశైలి, వంశపారంపర్యం, మానసిక ఒత్తిడి, రెగ్యులర్‌గా జం క్‌ఫుడ్‌ తినడం, వ్యాయామం చే యకపోవడం, పొగాకు, మద్యం వ్యసనాలతో బీపీ, షుగర్‌లు వస్తా యి. ఆహార అలవాట్లను మార్చుకుంటే వీటిని కొంత వరకు తగ్గిం చుకోవచ్చు. జిల్లాలో అధిక రక్తపోటుతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వీరంతా డాక్టర్‌ ఇచ్చే మందులు వాడాలి. రోగులకు ఎన్‌సీడీ ద్వారా ప్ర భుత్వం మందులందిస్తోంది. క్రమం తప్పక వాడా లి. షుగర్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతీ నాలుగైదు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి.

- డాక్టర్‌ సీహెచ్‌రాకేష్‌, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌

ప్రతీ ఒక్కరు టెస్టులు చేయించుకోవాలి

ప్రతీ ఒక్కరు టెస్టులు చేయించుకోవాలి. బీపీ, షుగర్‌ ఉందని తేలితే తగ్గించుకునేందుకు ప్రయ త్నించాలి. నిత్యం వ్యాయామం చే స్తూ సమయానికి మందులు వేసుకోవాలి. ప్రభుత్వాస్పత్రుల్లో బీపీ, షుగర్‌ టెస్టులు ఉచితంగా చేస్తున్నాం. మందులు కూడా ఇస్తున్నాం. బీపీ, షుగర్‌ ఉన్న వాళ్లు రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకోవాలి.

- డాక్టర్‌ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్య అధికారి

Updated Date - Dec 20 , 2024 | 12:06 AM