ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టార్గెట్‌ 100%

ABN, Publish Date - Dec 24 , 2024 | 12:42 AM

పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా వందరోజుల ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. ఈమేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులను చదివిస్తున్న ఉపాధ్యాయులు

‘పది’కి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం

వంద రోజుల్లో పరీక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక స్టడీ అవర్స్‌

వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్‌

జిల్లాలో 248 ఉన్నత పాఠశాలలు

మొత్తం 62,900 మంది విద్యార్థులు

పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా వందరోజుల ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. ఈమేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు జారీ చేసింది. మెరుగైన ఫలితాల సాధన, పరీక్షలంటే భయం పోగొట్టడం, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు ఉన్నత పాఠశాలల్లో రెండో శనివారంతో పాటు ఆదివారాల్లో కూడా ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నారు.

చేవెళ్ల, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించడంలో పదో తరగతి ఎంతో కీలకం. టెన్త్‌ ఫలితాలపైనే వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. దాంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ వంద రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఒక ప్రణాళిక ప్రకారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతీనెల రెండో శనివారం, ఆదివారం సైతం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో భాగంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు మిగిలిన వారు ఉత్తమ మార్కులు సాధించేలా దృష్టి సారిస్తున్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయి పెరగడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 248 ఉన్నత పాఠశాలల్లో 62,900 మంది విద్యార్థులున్నారు. వచ్చే ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో నవంబరు నుంచి మార్చి వరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. సబ్జెక్టులవారిగా టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలు ఇటీవల ప్రభుత్వం ఖరారు చేసింది. 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల విడుదల చేశారు. గతంలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టు వారీగా విద్యార్థులకు అసైన్‌మెంట్‌ ఇస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధి ంచేలా తర్ఫీదిచ్చేలా ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నారు.

అదనపు తరగతుల నిర్వహణ

పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించే ప్రణాళికలో భాగంగా రో జూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఒక సబ్జెక్టు, సాయంత్రం మరో సబ్జెక్టును చదివిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు వెనుకబడి ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌..

పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్తారు. 2025 మార్చి 21న తెలుగు, 22న సెంకడ్‌ లాంగ్వే జ్‌, 24న ఇంగ్లీష్‌, 26న గణితం, 28న ఫిజిక్స్‌, 29న బయోలాజికల్‌ సైన్స్‌, ఏప్రిల్‌ 2న సోషల్‌, 3న మెయిన్‌ లాంగ్వేజ్‌(సంస్కృతం, అరబిక్‌), 4న మెయిన్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌) నిర్వహిస్తారు.

మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యం

టెన్త్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాఽధించేందుకు కృషిచేస్తున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రణాళికను అమలుచేస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాల ఆధారం గా.. ముఖ్యంగా వెనుకబడిన వారిని ప్రత్యేక శ్రద్ధతో చదివిస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థు లకు పాఠశాలల్లో ప్రత్యేక భోధన కొనసాగుతోంది. రోజూ పాఠశాలలను తనిఖీ చేస్తాం. - పురందాస్‌, ఎంఈవో, చేవెళ్ల

Updated Date - Dec 24 , 2024 | 12:42 AM