ఉరేసుకొని యువకుడి దుర్మరణం
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:12 AM
కపుడు నొప్పి భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని మృతిచెందిన ఘటన గురువారం శంషాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని నర్కూడకు చెందిన నీరటి ప్రసాద్(22) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
శంషాబాద్ రూరల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కపుడు నొప్పి భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని మృతిచెందిన ఘటన గురువారం శంషాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని నర్కూడకు చెందిన నీరటి ప్రసాద్(22) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఉదయం పొలం వద్దకు వెళ్లి షెడ్డులో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పక్క పొలం రైతులు ప్రసాద్ తల్లిదండ్రులకు విషయం తెలిపారు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. కాగా, కొంత కాలంగా అతడు ఆనారోగ్య సమస్యలతో మానసిక వేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పిన ప్రసాద్ ఉరేసుకొని మరణించినట్లు తెలిపారు. మృతదేహన్ని ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రసాద్ డిగ్రీ చదువుతున్నట్లు తెలిపారు.
Updated Date - Dec 27 , 2024 | 12:12 AM