ఆలయంలో చోరీ
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:03 AM
అవుషాపూర్‌లోని బ్రహ్మంగారి ఆలయంలో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఘట్‌కేసర్ రూరల్, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): అవుషాపూర్‌లోని బ్రహ్మంగారి ఆలయంలో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రోజువారిగానే పూజారి శుక్రవారం తెల్లవారుజామున బ్రహ్మంగారి ఆలయానికి పూజచేయడానికి వెళ్లాడు. ఆలయ గర్భగుడికి ఉన్న తాళం పగులగొట్టి ఉండగా, అమ్మవారి మెడలోని అరతులం బంగారు ఆభరణం, హుండీ కనిపించలేదు. సమీపంలోని నిర్మానుష ప్రదేశంలో హుండీ కనిపించింది. ఈ మేరకు పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీలో యాభైవేల నగదు దుండగులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - Dec 21 , 2024 | 12:03 AM