కలప లారీ పట్టివేత
ABN, Publish Date - Dec 27 , 2024 | 11:39 PM
చౌడాపూర్ మండలంలోని అటవీ ప్రాంతమైన వెంకటాపూర్ గ్రామ పంచాయతీ శివారులో అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
కులకచర్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): చౌడాపూర్ మండలంలోని అటవీ ప్రాంతమైన వెంకటాపూర్ గ్రామ పంచాయతీ శివారులో అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న లారీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్టు సెక్షన్ అధికారి మోహినోద్దీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అడవి వెంకటాపూర్ శివారు పరిధిలో నుంచి అనుమతులు లేకుండా శుక్రవారం సాయంత్రం లారీలో అక్రమంగా కలపను తరలిస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ మొహ్మద్‌పై కేసు నమోదు చేసి పరిగి అటవీ శాఖ కార్యాలయానికి లారీని తరలించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Updated Date - Dec 27 , 2024 | 11:39 PM