దేశాభివృద్ధికి తోడ్పడాలి
ABN, Publish Date - Dec 22 , 2024 | 11:50 PM
ఐపీఈలో చదువుకున్న విద్యార్థులు వృత్తిలో అంకితభావం కలిగి ఉంటూ ఉత్తమ సేవలందించి దేశాభివృద్ధికి బాధ్యతగా తోడ్పడాలని బీహెచ్‌ఈఎల్(బెల్) మాజీ సీఎండీ, ఐపీఈ గవర్నింగ్ బోర్డ్ మెంబర్ ప్రసాదరావు హితవు పలికారు. శనివారం సాయంత్రం శామీర్‌పేటలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్(ఐపీఈ)లో డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆలుమ్నీ మీట్-2024(పూర్వ విద్యార్థుల సమావేశం) నిర్వహించారు.
బీహెచ్‌ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావు
శామీర్‌పేటలోని ఐపీఈలో ఆలుమ్నీ మీట్-2024
శామీర్‌పేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఐపీఈలో చదువుకున్న విద్యార్థులు వృత్తిలో అంకితభావం కలిగి ఉంటూ ఉత్తమ సేవలందించి దేశాభివృద్ధికి బాధ్యతగా తోడ్పడాలని బీహెచ్‌ఈఎల్(బెల్) మాజీ సీఎండీ, ఐపీఈ గవర్నింగ్ బోర్డ్ మెంబర్ ప్రసాదరావు హితవు పలికారు. శనివారం సాయంత్రం శామీర్‌పేటలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్(ఐపీఈ)లో డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆలుమ్నీ మీట్-2024(పూర్వ విద్యార్థుల సమావేశం) నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసాదరావు మాట్లాడుతూ ఐపీఈలో చదువు పూర్తిచేసిన విద్యార్థులు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు. ఐపీఈ బోర్డ్ గవర్నింగ్ అధ్యక్షుడు కాకి మాధవరావు(రిటైర్డ్ ఐఏఎస్) మాట్లాడుతూ ఆర్థిక విలువలకంటే మానవ విలువలు ఎంతో ముఖ్యమని చెప్పారు. ఐపీఈ విద్యార్థులు మంచి విలువలతో కూడిన విద్యనభ్యసిస్తూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలన్నారు. ఐపీఈ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆలుమ్నీ మీట్‌కు వచ్చిన పూర్వ విద్యార్థులకు, అతిథిలకు ఘన స్వాగతం పలికారు. ఐపీఈలో పీజీడీఎం ప్రోగ్రామ్‌లకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్, పూర్తి పీజీపీ నమోదు చేసుకున్న విద్యార్థులకు రూ.2కోట్ల స్కాలర్‌షి్‌పలతో పాటు ఆధునిక సౌకర్యాలను అందిస్తు విద్యార్థులకు సంస్థ చేయూతనిస్తోందని వివరించారు. కాగా, ఐపీఈలో నిర్వహించిన ఆలుమ్నీ మీట్‌లో చాలామంది పూర్వవిద్యార్థులు పాల్గొని ఒకనొకరు పలకరించుకున్నారు. కార్యక్రమంలో 1995-97 నుంచి 2022-24 ఐపీఈలో విద్యనభ్యసించిన విద్యార్థులు, మాజీ సీజీఎం మహాపరా అలీ, పూర్వవిద్యార్థుల రిలేషన్స్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ముజామిల్ అహ్మద్ బాబా, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 11:51 PM