ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాజ్‌పేయిని ఆదర్శంగా తీసుకోవాలి

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:22 AM

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వాజ్‌పేయి జయంతి సందర్భంగా శంకర్‌పల్లి మండల కేంద్రంలో చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రత్నం, మండలాధ్యక్షుడు రాములుగౌడ్‌, జిల్లా నాయకులు తదితరులున్నారు.

శంకర్‌పల్లి : వాజ్‌పేయి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, రత్నం తదితరులు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మాజీ ప్రధాని శత జయంతి సందర్భంగా నివాళి

చేవెళ్ల/శంకర్‌పల్లి/ఇబ్రహీంపట్నం/కందుకూరు/యాచారం/షాద్‌నగర్‌ అర్బన్‌/కేశంపేట/ చౌదరిగూడ/ఆమనగల్లు/ కడ్తాల్‌/ మాడ్గుల/ శంషాబాద్‌/మొయినాబాద్‌ రూరల్‌ డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం వాజ్‌పేయి జయంతి సందర్భంగా శంకర్‌పల్లి మండల కేంద్రంలో చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే రత్నం, మండలాధ్యక్షుడు రాములుగౌడ్‌, జిల్లా నాయకులు తదితరులున్నారు. బీజేపీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి, జిల్లా యువ నాయకుడు మల్గారి వైభవ్‌రెడ్డి వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. వాజ్‌పేయి సేవలను ప్రజలు ఏనాడూ మరువరని మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్‌ అన్నారు. ఇబ్రహీంపట్నంలో వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. బోసుపల్లి ప్రతాప్‌, నర్సింహారెడ్డి, ముత్యాల భాస్కర్‌, తదితరులున్నారు. బీజేపీ రాష్ట్ర సంఘటన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డిలు కందుకూరు మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డిలతో కలిసి వాజ్‌పాయ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మండల ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, లయన్స్‌క్లబ్‌ జిల్లా వైస్‌గవర్నర్‌ జి.మహేంద్రకుమార్‌రెడ్డి, తదితరులున్నారు. బీజేవైఎం రాష్ట్ర లీగల్‌సెల్‌ కన్వీనర్‌ పగడాల శ్రీశైలం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్‌ రవీందర్‌రెడ్డిలు యాచారం మండల కేంద్రంలో వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, బీజేవైఎం రాష్ట్ర నాయకులు శాంతికుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు బీరప్ప, నాయకులున్నారు. వాజ్‌పేయి శతజయంతిని పురష్కరించుకొని షాద్‌నగర్‌ బీజేపీ కార్యాలయం వద్ద నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. శ్రీవర్ధన్‌రెడ్డి, బాబయ్య, చెంది మహేందర్‌రెడ్డి, దేపల్లి అశోక్‌గౌడ్‌, వంశీకృష్ణ, ఎం.రాము, బాల్‌రెడ్డి, ఎస్‌. శ్యాంసుందర్‌రెడ్డి, ప్రవీణ్‌, జె.నర్సింహ, మోహన్‌సింగ్‌, బాల్‌రాజ్‌, కె.శివ, సుధాకరప్ప తదితరులున్నారు. అలాగే కేశంపేట మండల పరిధిలోని కొత్తపేటలో బీజేవైఎం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలో వాజ్‌పేయి జయంతిని బీజేపీ మండలాధ్యక్షుడు కురుమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరి భూపాలచారి పాల్గొన్నారు. మాడ్గుల మండల కేంద్రంలోని మండలాధ్యక్షుడు పెద్దయ్య ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు నివాళులర్పించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆమనగల్లులో జరిగిన కార్యక్రమంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఆర్‌ఎ్‌సఎస్‌ తెలంగాణ ప్రాంత సంఘటన్‌ మంత్రి చంద్రశేఖర్‌జీ పాల్గొన్నారు. కడ్తాల మండల కేంద్రంలో నిర్వహించిన జయంతిలో బీజేపీ మండలాధ్యక్షుడు మన్యనాయక్‌, నాయకులు భగీరథ, రెడ్యనాయక్‌, తదితరులున్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నందకిషోర్‌ ఆధ్వర్యంలో వాజ్‌పేయి శతజయంతిని నిర్వహించారు. జిల్లా బీజేపీ సీనియర్‌ నాయకుడు గున్నాల గోపాల్‌రెడ్డి వాజ్‌పేయి జయంతి సందర్భంగా మొయినాబాద్‌ మండలంలోని భాస్కర ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Updated Date - Dec 26 , 2024 | 12:22 AM