కన్హా శాంతివనానికి రేపుఉప రాష్ట్రపతి రాక
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:48 AM
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రేపు(బుధవారం) రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనానికి రానున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్న జగదీప్ ధన్కడ్
నందిగామ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రేపు(బుధవారం) రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనానికి రానున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం కన్హా శాంతివనంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప రాష్ట్రపతి ఈనెల 25, 26న కన్హా శాంతివనంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్న తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీసీపీ ఎల్సీ నాయక్, అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 12:48 AM