రేషన్.. ఆశలు
ABN, Publish Date - Dec 24 , 2024 | 12:38 AM
కొత్త రేషన్ కార్డులకు ఎట్టకేలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 18న అసెంబ్లీ అసెంబ్లీ లో బిల్లు పెట్టడం, కొత్త రేషన్ కార్డు కోసం దర ఖాస్తు చేసుకున్న వారికి సంక్రాంతి తర్వాత కార్డులు అం దిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
సంక్రాంతి తర్వాత నయా కార్డులు
మంత్రి ప్రకటనతో దరఖాస్తు దారుల్లో ఆశలు
ఆరున్నరేళ్ల నిరీక్షణకు పడనున్న తెర
సంక్షేమ పథకాల అర్హతకు తొలగనున్న ఆటంకం
జిల్లాలో ఆరు వేల దరఖాస్తులు
రఘునాథపల్లి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్ కార్డులకు ఎట్టకేలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 18న అసెంబ్లీ అసెంబ్లీ లో బిల్లు పెట్టడం, కొత్త రేషన్ కార్డు కోసం దర ఖాస్తు చేసుకున్న వారికి సంక్రాంతి తర్వాత కార్డులు అం దిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సర్కారు నిర్ణయంతో ఆరున్నర ఏళ్లు నిరీక్షణకు ఇక తెరపడనుంది.
జిల్లాలో పౌర సరఫరా శాఖ పోర్టల్‌లో కొత్త రేషన్ కార్డులు, పేర్ల మార్పులు, చేర్పులకు సుమా రు ఆరువేల దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్ప టివరకు కార్డుల్లో పేర్లు తొలగిస్తున్న అధికా రులు కొత్తగా పేర్లను మాత్రం చేర్చడం లేదు. కూతురి పెళ్లి కాగానే పుట్టింటి వారి రేషన్ కార్డులో నుంచి ఆ యువతి పేరు తొలగిస్తున్న అధికారులు, అత్తిం టి వారి రేషన్‌కార్డులో మాత్రం పేరు చేర్చడం లే దు. దాంతో అర్హత ఉన్నా పేదలకు రేషన్ బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయో జనాలు అందకుండా పోతున్నాయి.
కార్డు లేక అందని సంక్షేమ ఫలాలు
కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇవ్వడంతో ఇన్ని రోజులుగా రేషన్ కార్డు లేద నే కారణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం గా ఉన్నవారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1,61,147 ఆహార భద్రత కార్డులున్నాయి. ఇందులో 4,86,615 మంది కుటుంబ సభ్యులు నమో దై ఉన్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా అర్హులైన పేదలకు తెల్ల రేషన్‌కార్డుల జారీ అందని ద్రాక్షగానే మిగిలిపోయిం ది. 2018 నుంచి ఇప్పటి వరకు రేషన్‌కార్డుల జారీని నిలిపివేయగా, రేషన్‌కార్డులు లేకపోవడంతో పలువు రు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నా రు. ఆరున్నర ఏళ్లుగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు కాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలో ఉండి వేరుప డిన వారికి కార్డులు లేకుండాపోయాయి. దీంతో వా రంతా గ్యారెంటీ పథకాలను అందుకోలేక పోతున్నారు.
ఆరు గ్యారెంటీలకు కీలకం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆ పథకాలు పొందాలం టే రేషన్‌కార్డు ప్రామాణికమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ బియ్యం అందాలన్నా, పింఛన్ పొందాలన్నా, రుణమాఫీ అమలు కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరున్నర ఏళ్ల నుంచి రేషన్‌కార్డులు జారీకాలేదు. ఈ ఆరున్నర ఏళ్లలో పెళ్లయిన జంటలకు రేషన్ కార్డుల్లేవు.
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోతే..
గ్యాస్ వినియోగదారులు సిలిండర్ ధరను ఏజెన్సీ నిర్వాహకుల చెల్లించి సిలిండర్ తీసుకోవాలి. సిలిండ ర్ తీసుకున్న తర్వాత వారి ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ చేస్తారు. గ్యాస్ వినియోగదారుల్లో రేషన్‌కార్డుదా రులే అత్యధికులు ఉంటారు. బ్యాంకు ఖాతాలు సక్రమంగా కొనసాగుతున్న వారికి మాత్రమే సబ్సి డీ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది. రేషన్‌కార్డుకు అనుసంధానమై ఉన్న భ్యాంకు ఖాతా వినియోగంలో లేకపోతే తిరిగి పునరుద్ధర ణ, కొత్త ఖాతాలకు అనుమతి ఉండడం లేదని వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డుదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రారం భించారు. జిల్లాలో రెండు లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నా రు. వీరిలో రేషన్‌కార్డులు లేని వారు ఎక్కువ మందే ఉండడం గమనార్హం.
ఎట్టకేలకు మోక్షం..
గతంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినా ఆ ప్రక్రియ ముందుకు సాగకపో వడంతో కొత్త కార్డులు మంజూరు కాలేదు. ప్రజాపాలనలో భాగంగా అధికారులు దరఖాస్తు లు స్వీకరించగా ఇందులో రేషన్‌కార్డులకు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,61,147 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందులో 4,86,615 మంది కుటుంబ సభ్యులు నమోదై ఉన్నారు. ఆరున్నర ఏళ్ల నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం, పిల్లల పేర్ల చేర్పులు, వివాహమైన వారి పేర్ల నమోదుకు ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.
పథకాలకు దూరమయ్యాం: కోళ్ల సందీప్, రఘునాథపల్లి
రేషన్‌కార్డుల మంజూరు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాం. నాకు పెళ్లయి నాలుగేళ్లయింది. కొడుకు కూడా ఉన్నాడు. అయినా రేషన్ కార్డు లేదు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది.
ఏళ్ల తరబడి ఎదురుచూపులు: కొలిపాక రాజు, నిడిగొండ
ఏళ్ల నుంచి కొత్త రేషన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నా. పెళ్లయి ఐదేళ్లయినా రేషన్‌కార్డు మంజూరు కాలేదు. రేషన్ లేక సంక్షేమ ఫలాలకు దూరమయ్యాం. సంక్రాంతి తర్వాత మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించడం సంతోషంగా ఉంది.
Updated Date - Dec 24 , 2024 | 12:38 AM