Phone Taping Case: రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే డివైజ్ అమర్చిన ప్రణీత్ రావు, రవిపాల్
ABN, Publish Date - Mar 25 , 2024 | 09:15 PM
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నా కొద్ది మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నా కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఐడీకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ ఈ కేసు విచారణలో కీలకంగా మారాడు. రవిపాల్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లను తీసుకువచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నా కొద్ది మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నా కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఐడీకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ ఈ కేసు విచారణలో కీలకంగా మారాడు. రవిపాల్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లను తీసుకువచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టాపింగ్ డివైజ్‌లను రవిపాల్ తీసుకొచ్చాడు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ఈ పరికరాలను రవి పాల్ దిగుమతి చేశాడు. అందుకుగానూ రవిపాల్‌కి ఎస్‌ఐబీ పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను చెల్లించిందని గుర్తించారు.
రవిపాల్, ప్రభాకర్ రావు ఇద్దరూ కలిసి అధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఈ అధునాతన పరికరాలతో 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడతాయని తేలింది. రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఆఫీస్ ఏర్పాటు చేసి ఈ డివైజ్‌లను రవి పాల్ ఏర్పాటు చేశాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత రావు, రవిపాల్ ఇద్దరూ విన్నారు. రవి పాల్‌ని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Updated Date - Mar 25 , 2024 | 09:17 PM