RBI Report: రాష్ట్ర అప్పు 4.57,783 కోట్లు
ABN, Publish Date - Dec 13 , 2024 | 03:02 AM
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు రూ.4,57,783 కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ మొత్తంలో బడ్జెట్ పరంగా తీసుకున్న అప్పులు, వివిధ కార్పొరేషన్ల పేరుతో సేకరించిన గ్యారెంటీ రుణాలున్నట్లు వివరించింది.
ఆర్‌బీఐ ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’లో వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు రూ.4,57,783 కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ మొత్తంలో బడ్జెట్ పరంగా తీసుకున్న అప్పులు, వివిధ కార్పొరేషన్ల పేరుతో సేకరించిన గ్యారెంటీ రుణాలున్నట్లు వివరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సేకరించిన అప్పు, ప్రావిడెంట్ ఫండ్, ఇతర డిపాజిట్లు, అడ్వాన్సులన్నింటినీ కలిపితే.. అప్పు మొత్తం రూ.5,24,955 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాల అప్పులు, జీఎ్‌సడీపీ తదితర వివరాలతో తాజాగా ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’ను విడుదల చేసింది. దీని ప్రకారం 2024 మార్చి నాటికి తెలంగాణ అప్పు రూ.3,22,501 కోట్లుగా ఉంది.
వివిధ కార్పొరేషన్ల పేర అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న గ్యారెంటీ అప్పులు 2022 మార్చి నాటికి రూ.1,35,282 కోట్లుగా నమోదయ్యాయి. ఈ రెండూ కలిపి.. రూ.4,57,783 కోట్లుగా తేలిందని ఆర్‌బీఐ పేర్కొంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ.14,775 కోట్ల రుణం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి రూ.14,688 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సులకు సంబంధించి రూ.35,571 కోట్లు, రిజర్వ్ ఫండ్ రూ.2,088 కోట్లను కూడా ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే రాష్ట్ర మొత్తం అప్పు 5,24,955 కోట్లుగా తేలుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2023-24 సంవత్సరంలో జీఎ్‌సడీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.15,01,98,141 కోట్లుగా ఉందని తెలిపింది. అంతకు ముందు సంవ్సతరం జీఎ్‌సడీపీ రూ.13,11,82,302 కోట్లుగా నమోదైనట్లు గుర్తుచేసింది.
Updated Date - Dec 13 , 2024 | 03:02 AM