BRS MLA: మల్లారెడ్డికి మరోసారి షాక్
ABN, Publish Date - Jun 12 , 2024 | 07:00 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి మరోసారి షాక్ తగిలింది. సుచిత్రలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై మేడ్చల్ కోర్టుకు బుధవారం రెవెన్యూ శాఖ అధికారులు నివేదిక అందజేశారు.
హైదరాబాద్, జూన్ 12: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి మరోసారి షాక్ తగిలింది. సుచిత్రలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై మేడ్చల్ కోర్టుకు బుధవారం రెవెన్యూ శాఖ అధికారులు నివేదిక అందజేశారు. ఆ క్రమంలో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.
అలాగే ఇతరుల భూమిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలకు ఉప్రకమించాలని తమ నివేదికలో రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. అయితే రెవెన్యూ శాఖ నివేదికతో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగినట్లు అయింది. ఇక తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు.. మేడ్చల్ కోర్టును కోరుతున్నారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
Updated Date - Jun 12 , 2024 | 08:44 PM