గురుకులంలో పురుగుల అన్నం
ABN, Publish Date - Nov 13 , 2024 | 04:32 AM
నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల జరిగింది.
ప్రశ్నించిన విద్యార్థిని కొట్టిన ఇన్‌చార్జి ప్రిన్సిపాల్
పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఘటన
తుంగతుర్తి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నీళ్ల చారు, పురుగుల అన్నం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల జరిగింది. ఘటనపై విద్యార్థి తండ్రి గుగులోతు భాస్కర్ ఉన్నతాధికారులతో పాటు పెన్‌పహాడ్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ రుద్రక్రాంతితోపాటు రాష్ట్ర గురుకుల పాఠశాలల ప్రతినిధి రాజు గురుకులానికి వచ్చి సమాచారం సేకరించారు. సరైన మెనూ అందడం లేదని ప్రశ్నించినందుకే ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సతీశ్ కొట్టాడని విద్యార్థులు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతానని విచారణకు వచ్చిన రాజు తెలిపారు.
ముద్దలుగా అన్నం.. విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో ముద్దలుగా మారిన అన్నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జీర్ణం కాక కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం బయటకు పొక్కకుండా విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట రమణతో, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పాత బియ్యం అయిపోవడంతో కొత్త బియ్యం పంపించారని, సమస్యలు తలెత్తిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రిన్సిపల్ తెలిపారు.
Updated Date - Nov 13 , 2024 | 04:32 AM