ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇంట్లో చోరీ
ABN, Publish Date - Nov 02 , 2024 | 04:11 AM
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో గురువారం చోరీ జరిగింది.
కాగజ్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో గురువారం చోరీ జరిగింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం డాడానగర్లో గల ఇంట్లో దుండగులు లూఠీకి పాల్పడ్డారు. ఇంటికి ఉన్న తాళాన్ని పగులగొట్టి, సీసీ కెమెరా వైర్లను కట్‌చేసి దొంగలు చోరీ చేశారు.
గన్మెన్లు ఉండే గది బీరువాను పగులగొట్టి కీలకపత్రాలు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారని ఆర్ఎస్ ప్రవీణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రామానుజం, సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Nov 02 , 2024 | 04:11 AM