ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sajjanar: సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ప్రయాణికులు!

ABN, Publish Date - Jan 14 , 2024 | 06:11 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను పెంచినట్లు TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతోపాటు ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 52 లక్షల మందికిపైగా ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది వారి వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజుల పండుగ తర్వాత తిరిగి వారి ప్రాంతాలకు రానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఒక్క రోజే తెలంగాణ ఆర్టీసీ ఏకంగా 52.78 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిందని టీఆర్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు.

ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1861 ప్రత్యేక బస్సులను నడిపామని తెలిపారు. ఈ సంక్రాంతి సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, గత మూడు రోజుల్లోనే 4,400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపామని సజ్జనార్ వివరించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ponnam Prabhakar: బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మలేదు: పొన్నం ప్రభాకర్

సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బస్సులను పెంచగా మరికొన్ని రోజుల్లో ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి వస్తే ఈ రాకపోకల సంఖ్య మరింత పెరగనుంది. అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసు స్కీంను అమలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 06:17 PM

Advertising
Advertising