Sarees: నకిలీ ప్రింట్‌తో చీరలు, ఇక్కత్ పేరుతో మోసం.. భూదాన్ పోచంపల్లిలో రైడ్స్
ABN, Publish Date - Jan 23 , 2024 | 01:40 PM
ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని షాపులు నకిలీ ఇక్కత్ చీరలు, నకిలీ ప్రింటెడ్ చీరలను విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
యాదాద్రి: ఇక్కత్ చీరలు అంటే మగువలు తెగ ఇష్టపడతారు. ఆ చీరలను కొనుగోలు చేసేందుకు అమితాసక్తి కనబరుస్తారు. ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. అక్కడ ఉన్న షాపుల్లో చీరలు అంటే డౌట్ అక్కర్లేదని కొనుగోలు చేస్తారు. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో కొన్ని షాపులు నకిలీ ఇక్కత్ చీరలు, నకిలీ ప్రింటెడ్ చీరలను విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు మంగళవారం నాడు తనిఖీలు చేపట్టారు. హ్యాండ్లూమ్ షాపుల నుంచి నకిలీ ప్రింట్ ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఆ షాపు యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఆ చీరలను పరిశీలించి చూస్తే తప్ప నకిలీవి అని తెలియదు. అచ్చం సూరత్ నుంచి తీసుకొచ్చిన చీరల మాదిరిగా కనిపించాయి.
ఇక్కత్ అంటే ఏంటీ..?
ఇక్కత్ చీరలు అంటే భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. ఆ చీరలు ఇక్కడే పుట్టాయని చెబుతుంటారు. చీరలకు రంగులు వేసే సంప్రదాయ పద్ధతిని ఇక్కత్ అని పిలుస్తారు. చీరకు ఎక్కడ రంగు వేయాలో ఊహించుకొని అక్కడ వేస్తారు. ఈ పద్ధతిని రెసిస్ట్ డైయింట్ అంటారు. దారాలకు రంగులేసి, డిజైన్లను వేస్తారు. పురాతన పద్దతుల్లో రెసిస్ట్ డైయింగ్ ఒకటి. పోచంపల్లి ఇక్కత్ చీరలు 1800 కాలంలోనే మంచి పేరు గడించాయి. పోచంపల్లిలో దాదాపు 10 వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల జీవన ఆధారం చీరల నేయడమే. ఇక్కత్‌ను ఒక చీరల్లో కాదు సల్వార్లు, స్కర్ట్, అనార్కలీ, లెహంగాల్లో కూడా ఉపయోగిస్తారు. చీరల ప్రామాణికతను నిర్ధారించే జియగ్రాఫికల్ ఇండికేటర్ 2005లో పోచంపల్లికి లభించింది. పోచంపల్లి చీరలను సెలబ్రిటీలు ధరించారు. ఐశ్వర్యరాయ్ తన పెళ్లి, రిసెప్షన్‌లో పోచంపల్లి చీర కట్టుకున్నారు. ఇక్కత్ చీరలు సూరత్‌లో చాలా ఫేమస్. అక్కడ నేసే చీరలు అంటే మహిళలు తెగ ఇష్టపడతారు.
మోసం
ఇక్కత్‌కు కొందరు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. భూదాన్ పోచంపల్లిలో గల షాపుల్లో కొందరు నకిలీ చీరలను విక్రయిస్తున్నారు. ఇతర చోట్ల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి జనాలను మోసం చేస్తున్నారు. చాలా మందికి ఇక్కత్ చీరలంటే ఐడియా ఉండదు. అలా వారిని బురిడి కొట్టించి మోసం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారుల సోదాలతో కొన్ని షాపు నిర్వాహకులు చేస్తోన్న మోసం బట్టబయలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 23 , 2024 | 01:40 PM