వేంపేటలో శతచండీ మహా సుదర్శన ఉత్సవాలు
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:42 AM
మండలంలోని వేంపేట గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శతచండి మహాసుదర్శన నారసింహ యాగ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
మెట్‌పల్లి రూరల్, డిసెంబర్, 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వేంపేట గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శతచండి మహాసుదర్శన నారసింహ యాగ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు తదితర కార్యక్రమాలను చేపట్టగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీచక్రపాణి వామనాచార్యులు వేదమంత్రోత్స వాల మధ్య నగర సంకీర్తన, గ్రామ ప్రదక్షణ, ఆలయ ప్రవేశం, యజ్ఞఆరంభసూచన, ధ్వ జారోహణము, గోపూజ పుణ్యాహవచనము, అంకురారోపణము వంటి కార్యక్రమాలను భక్తు లచే జరిపించారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థా ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ, గామాభివృద్ధి కమిటి నాయకులు, సభ్యులు, మహిళలు, భక్తులు, పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 12:43 AM