ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేలిముద్ర పడకున్నా అవ్వాతాతలకు పింఛను

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:52 AM

వయోభారంతో బాధపడుతూ ప్రభుత్వం అందించే చేయూత పింఛన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. వీరంతా తమకు సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర ద్వారా తమ గుర్తింపును నిరూపించుకుని పింఛను సొమ్ము పొందుతారు.

  • పంచాయతీ కార్యదర్శుల వేలిముద్రతో

  • లబ్ధిదారుల గుర్తింపు, నగదు పంపిణీ

  • వయోవృద్ధుల సమస్యకు పరిష్కారం

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వయోభారంతో బాధపడుతూ ప్రభుత్వం అందించే చేయూత పింఛన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. వీరంతా తమకు సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర ద్వారా తమ గుర్తింపును నిరూపించుకుని పింఛను సొమ్ము పొందుతారు. కంప్యూటర్‌తో అనుసంధానమైన యంత్రాలు ఒక వేళ వేలిముద్రను గుర్తించకపోతే పింఛను లేనట్టే. ఆ యంత్రం వేలిముద్రను గుర్తించే దాకా రోజులైనా సరే వేచి ఉండాల్సిందే. రాష్ట్రంలో చాలా మంది వృద్ధులు, మంచానికి పరిమితమైన వారు ఈ వేలిముద్ర సమస్య వల్ల అవస్థలు పడుతున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను గుర్తించిన గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (ఎస్‌ఈఆర్‌పీ) ఓ పరిష్కారాన్ని ఆలోచించింది.


ఎవరైనా వృద్ధుల వేలిముద్రను యంత్రాలు గుర్తించకపోతే.. పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్ర నమోదు చేసి పింఛను సొమ్మును లబ్ధిదారుకు ఇచ్చే అవకాశం కల్పించింది. అనారోగ్యంతో బాధపడుతూ ఇల్లు వదిలి రాలేని స్థితిలో ఉన్న లబ్ధిదారుల అంశంలోనూ పంచాయతీ కార్యదర్శులకు ఈ అధికారం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సెర్ప్‌ సీఈఓ డి.దివ్య శుక్రవారం జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను అమలు చేయాలని డీఆర్డీవోలకు ఆమె సూచించారు. ఈ విధానం విజయవంతమైతే వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో ప్రధాన సమస్య మాయమైనట్టే.!!

Updated Date - Nov 30 , 2024 | 03:52 AM