ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: రక్త మోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

ABN, Publish Date - Aug 05 , 2024 | 09:09 AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మరణించారు. శ్రీశైలం జలాశయాన్ని చూడడానికి వెళ్తూ కారు రాత్రి చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మచ్చ బొల్లారానికి చెందిన సాయి ప్రకాష్, కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మరణించారు. శ్రీశైలం జలాశయాన్ని చూడడానికి వెళ్తూ కారు రాత్రి చెట్టును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మచ్చ బొల్లారానికి చెందిన సాయి ప్రకాష్, కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో ప్రమాదంలో కొత్తగూడ వంతనపై బైక్ అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాల ప్రసన్న, రోహిత్ దుర్మరణం పాలయ్యారు. కేపీహెచ్‌బీ నుంచి వెళుతూ బైక్‌ను రైడర్ నిర్లక్ష్యంగా నడిపాడు. ఎన్ఐఏ ఫ్లై ఓవర్ వద్ద బైకు కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న జయశంకర్ అనే వ్యక్తి ఒక్కసారిగా కిందపడటంతో వెనుక నుంచి కంటైనర్ ట్రక్ తలపైకి ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. రంగాపూర్ మలుపు వద్ద కారును ఓవర్ టేక్ చేయబోయి బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫలక్ నుమ ప్రాంతానికి చెందిన తల్లీకుమారుడు మృతి చెందారు.


రూ.200 కోసం గొడవ..

కాగా.. రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడికి గురైన క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. ఉప్పర్ పల్లిలోని వివేక్ రెడ్డితో క్యాబ్ చార్జీ విషయంలో రెండేళ్ల క్రితం వివాదం తలెత్తింది. జూలై 2022 లో 200 రూపాయల‌ కోసం గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలివానగా మారి పెను దుమారాన్ని రేపింది. వివేక్ తన స్నేహితులకు ఫొన్ చేసి రప్పించాడు. దాదాపు 20 మంది యువకులు క్రికెట్ బ్యాట్స్, వికేట్స్, హాకీ స్టిక్స్‌తో వచ్చి వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. వెంబడించి వెంబడించి మరీ వివేక్ రెడ్డి గ్యాంగ్ దాడి చేసింది. స్పాట్‌లోనే క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ కుప్పకూలిపోయాడు. రంగ ప్రవేశం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.


రెండేళ్ల పాటు ప్రాణాల కోసం పోరాటం..

అసలు దాడికి పాల్పడిన వివేక్ రెడ్డి గ్యాంగ్‌ను వదిలేసి.. వెంకటేష్‌ను మాత్రం రాత్రంతా స్టేషన్ లోనే పోలీసులు కూర్చోబెట్టారు. తీవ్ర గాయాలపాలైన క్యాబ్ డ్రైవర్‌ను ఆసుపత్రికి కూడా తరలించలేదు. ఉదయానికి వెంకటేష్ పరిస్థితి విషమించింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ కోమాలోకి వెళ్లిపోయాడు. వెంకటేష్ కుటుంబ సభ్యులు రూ.2 కోట్లు ఖర్చు పెట్టినా వెంకటేష్ ప్రాణం దక్కలేదు. రెండేళ్ల పాటు నరకం అనుభవించి చివరకు వెంకటేష్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆస్తులన్నీ అమ్మి మరీ చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Updated Date - Aug 05 , 2024 | 09:09 AM

Advertising
Advertising
<