శాలిబండ పోలీస్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:13 AM
దక్షిణ మండలం ఛత్రినాక ఏసీపీ డివిజన్ పరిధిలోని శాలిబండ పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.
శాలిబండ పోలీస్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు చాంద్రాయణగుట్ట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మండలం ఛత్రినాక ఏసీపీ డివిజన్ పరిధిలోని శాలిబండ పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా శాలిబండ పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండడంతో దేశంలో 8వ ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ ఛత్రినాక సీహెచ్ చంద్రశేఖర్‌లు శాలిబండ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలో 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలవడం అభినందనీయమన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 04:13 AM