Property Dispute: హైదరాబాద్‌లో చంపేసి.. కర్ణాటకలో కాల్చేసి!
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:34 AM
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో అతడిని చంపి ఏకంగా కర్ణాటకకు తీసుకెళ్లి ఓ కాఫీ తోటలో శవాన్ని దహనం చేశారు.
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
కొడుగు జిల్లాలోని కాఫీ తోటలో శవం దహనం
ఘట్‌కేసర్ రూరల్/భువనగిరి టౌన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో అతడిని చంపి ఏకంగా కర్ణాటకకు తీసుకెళ్లి ఓ కాఫీ తోటలో శవాన్ని దహనం చేశారు. అయితే దీనిపై అక్కడి పోలీసులు ఫిర్యాదు అందగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. సికింద్రాబాద్ తుకారాంగేట్‌కు చెందిన బజారు రమేశ్ కుమార్ (54) కుటుంబ కలహాలతో భార్య, కూతురును వదిలి మేడ్చల్-మల్కాజిగిరి పోచారం ఐటీ కారిడార్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని సంస్కృతిటౌన్ షిప్‌లో మూడేళ్లుగా ఉంటున్నాడు. అయితే రమేశ్ 2018లో భువనగిరికి చెందిన నిహారికను బెంగళూరులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే అప్పటికే నిహారికకు కూడా పెళ్లయి విడిగా ఉంటున్నట్లు సమాచారం. అయితే వ్యసనపరురాలైన నిహారిక.. రమేశ్‌కు అబద్ధాలు చెబుతూ డబ్బు లు తీసుకునేది. తను పనిచేస్తున్న ఐటీ సంస్థ ఏడాదిన్నరగా జీతం చెల్లించట్లేదని చెప్పి.. గూగుల్ కంపెనీలో పని చేయడానికి జర్మనీ వెళ్లాల్సి ఉంద ని, అందుకోసం డబ్బులు కావాలని రూ.2.65 కోట్లు తీసుకుని వాడేసుకుంది. దీంతో అనుమానం వచ్చిన భర్త.. ఆరా తీయగా అదంతా అబద్ధమని తేలింది. దీంతో రమేశ్ నిహారికను దూరం పెడుతూ.. తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. అప్పటికే ఏపీలోని కడపకు చెందిన నిఖిల్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నిహారిక అతడికి విషయం చెప్పింది. రమేశ్‌ను చంపితే అతడి ఆస్తి కూడా దక్కించుకోవచ్చనడంతో నిఖిల్ కూడా అందుకు అంగీకరించాడు.
అతడి మిత్రుడు రాణాకు కూడా చెప్పి ఒప్పించాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు వచ్చిన రమేశ్‌ను కలిసేందుకు ఈనెల 4న సంస్కృతిటౌన్ షిప్‌కు ప్రియు డు నిఖిల్, రాణాతో కలసి నిహారిక చేరుకుంది. అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ఫీర్జాదిగూడ స్పార్క్ ఆస్పత్రి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో చేరుకున్నారు. అక్కడ డబ్బుల విషయమై గొడవ జరగ్గా.. కారు వెనుక సీట్లో కూర్చున్న నిఖిల్, రాణా ముందు సీట్లో ఉన్న రమేశ్ గొంతుకు తాడు బిగించి చంపారు. శవాన్ని కారు డిక్కీలో వేసుకోని కర్ణాటకలోని కొడుగుకు చేరుకుని కాల్చేశారు. సగం కాలిన శవంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నేరం అంగీకరించారు.
Updated Date - Oct 28 , 2024 | 04:34 AM