ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Siddipet: నలుగురూ నలుగురే.. డాక్టర్‌ సిస్టర్స్‌

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:21 AM

ప్రస్తుతమున్న పోటీ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థి ఎంబీబీఎస్‌ సాధించడమంటే పెద్ద విషయమే.

  • గతంలో ఇద్దరికి, ఈ ఏడాది మరో ఇద్దరికి ఎంబీబీఎస్‌ సీట్లు

  • సరస్వతీ పుత్రికలంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశంస

సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 10 : ప్రస్తుతమున్న పోటీ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థి ఎంబీబీఎస్‌ సాధించడమంటే పెద్ద విషయమే. అలాంటిది సిద్దిపేటలోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఎంబీబీఎస్‌ సీట్లు పొంది సరస్వతీ పుత్రికలు అనిపించుకున్నారు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం, శారద దంపతులకు మమత, మాధవి, రోహిణి, రోషిణి అనే కుమార్తెలు ఉన్నారు. వీరిలో 2018లో ఎంబీబీఎస్‌ సీటు సాధించిన మమత చదువు పూర్తి చేసింది.


మాధవి 2020లో సీటు పొందగా రోహిణి, రోషిణి ఇటీవల సీట్లు పొందారు. ఆ కుటుంబం మాజీ మంత్రి హరీశ్‌ రావును గురువారం కలవగా... విషయం తెలుసుకున్న ఆయన వారిని సరస్వతీ పుత్రీకలంటూ ప్రశంసించారు. అలాగే, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని రోహిణి, రోషిణి చదువుకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

Updated Date - Oct 11 , 2024 | 04:21 AM