ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TS News: తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేళాయే?

ABN, Publish Date - Sep 11 , 2024 | 12:42 PM

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి దాదాపు 10 నెలలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు సంపూర్ణంగా కేబినెట్ విస్తరణ జరగలేదు. ముహూర్తం ఖరారైందని విశ్వసనీయంగా తెలిసింది. అందుకోసమే సీఎం రేవంత్ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు.

CM Revanth Reddy

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి దాదాపు 10 నెలలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు సంపూర్ణంగా కేబినెట్ విస్తరణ జరగలేదు. ముహూర్తం ఖరారైందని విశ్వసనీయంగా తెలిసింది. సీఎం రేవంత్ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. హస్తినలో కాంగ్రెస్ హైకమాండ్‌తో మంత్రివర్గ విస్తరణపై రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల చూపు ఎవరిపై ఉంటుందోనని కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రేపు సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నామినేటెడ్, ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, పీసీసీ చీఫ్ నియామకం పూర్తవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే పడింది.


డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో 6 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హోం మంత్రిత్వశాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్‌తో పాటు పలు కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కాగా కేబినెట్‌లో చోటు కోసం పలువురు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.


రేసులో ఉన్నది ఎవరు?

కేబినెట్ విస్తరణలో పలువురు సీనియర్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రేసులో ఉన్న నేతల విషయానికి వస్తే ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, వినేద్ ఉన్నారు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరిని పదవులు వరించనున్నాయి?, అనూహ్యంగా ఇంకెవరైనా రేసులోకి వచ్చి పదవులు దక్కించుకుంటారా? అనేది చూడాల్సి ఉంది.


మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో రేపు (గురువారం) భేటీ కానున్నారు. వరద నష్టం అంచనా వివరాలు చెప్పి కేంద్ర సాయం కోరనున్నారు.

Updated Date - Sep 11 , 2024 | 03:20 PM

Advertising
Advertising