ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jagtial Drugs Case: జగిత్యాల డ్రగ్స్ కేసులో బ్లాస్టింగ్ ట్విస్ట్.. చదువు మానేసి మరీ..

ABN, Publish Date - Mar 23 , 2024 | 04:50 PM

జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10వ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసవ్వడం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. వెంటనే విచారణ చేపట్టి, నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లందరు చదువు మానేసి.. గంజాయి విక్రయిస్తున్నారని తెలిసింది.

జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10వ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసవ్వడం చూసి నివ్వెరపోయిన పోలీసులు.. వెంటనే విచారణ చేపట్టి, నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లందరు చదువు మానేసి.. గంజాయి విక్రయిస్తున్నారని తెలిసింది. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి గంజాయి తీసుకొచ్చి.. జగిత్యాలలో చిన్న ప్యాకెట్స్ రూపంలో అమ్ముతున్నట్టు వెల్లడైంది. ఈ విషయాలను ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ (SP Sunpreet Singh) మీడియాకు వెల్లడించారు. జగిత్యాలలో ఈ గంజాయి ముఠాని అరెస్టు చేశామని తెలిపారు.


ఇదిలావుండగా.. ఓ విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాలలో డ్రగ్స్ బాగోతం బయటపడింది. తన కూతురి ప్రవర్తనలో తేడా రావడంతో.. గంజాయికి బానిసైందన్న విషయం తెలుసుకొని, ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 10 మంది విద్యార్థినులు గంజాయికి బానిసైనట్లు తేలింది. దీని వెనుక ఓ సెక్స్ రాకెట్ ముఠా ఉందని.. ఆ బాలికల్ని రేవ్ పార్టీలకు కూడా పంపేవారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి, ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? డ్రగ్స్ వ్యాపారం ఎక్కడిదాకా వ్యాపించి ఉంది? అనే కోణాల్లో విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 04:51 PM

Advertising
Advertising