ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mancherial: రైతులను మోసం చేసి మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్.. విమర్శలు గుప్పించిన శ్రీధర్ బాబు

ABN, Publish Date - Apr 07 , 2024 | 06:02 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) గడిచిన 9 ఏళ్లలో రైతులను మోసం చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) విమర్శించారు.

మంచిర్యాల: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) గడిచిన 9 ఏళ్లలో రైతులను మోసం చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) విమర్శించారు. మంచిర్యాలలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణతో కలిసి ప్రచారంలో శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఎన్నికల కోడ్ రావడంతో రాష్ట్రంలో కొత్త పనులు చేయలేకపోతున్నాం.

ఎన్నికలైన తర్వాత నేత, గాండ్ల సామాజిక వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. సంచార జాతుల కోసం కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బీఆర్ఎస్ మాదిరిగా పార్టీ కార్యకర్తలకు లబ్ది చేకూర్చడం లేదు. గడిచిన 9 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అస్తవ్యస్థం చేశారు. రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారు.


కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నాం. రైతులను లూటీ చేసిన కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఓ వైపు రైతు బంధు ఇచ్చి.. మరో వైపు మిల్లర్లతో కలిసి బీఆర్ఎస్ నేతలు దోపిడీకి దిగారు. ఇప్పుడు రైతుల కోసం ధర్నాలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు. వర్షపాతం తక్కువగా ఉందని, కరువు వస్తుందని 2023 అక్టోబర్‌లోనే బీఆర్ఎస్ అనుకూల పత్రికలో రాశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని కారు కూతలు కూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన బ్యారేజీలు కుంగిపోతున్నాయి" అని శ్రీధర్ బాబు విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 06:05 PM

Advertising
Advertising