ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

ABN, Publish Date - Jul 16 , 2024 | 01:40 PM

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి నేతృత్వంలో కమిషన్‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది

న్యూఢిల్లీ, జులై 16: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి నేతృత్వంలో కమిషన్‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటను మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ క్రమంలో కేసీఆర్ వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్ ఎదుట కేసీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు.

విద్యుత్ విచారణ కమిటి నియామకంలో పరిధిని అతిక్రమించారని వివరించారు. ట్రిబ్యునల్ ఉండగా.. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నుంచి బయట పడడానికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. అయితే మార్కెట్ ధర కంటే తక్కువగా, యూనిట్ రూ.3.90కు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలిపారు.


తాను మాజీ ముఖ్యమంత్రినని.. ప్రస్తుతమున్న సీఎం రేవంతరెడ్డి గతంలో ఈ అంశంపై అనేక సార్లు ఆర్ టి ఐ వేశారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇది తమపై కక్ష సాధింపు చర్య అని పేర్కొన్నారు. ఈ విచారణకు ముందే తనను దోషిగా తేలుస్తున్నారన్నారు. ఈ కమిషన్ ఛైర్మన్ మీడియా సమావేశం పెట్టీ మరి అన్ని విషయాలు వివరిస్తున్నారని తెలిపారు. ఇదంతా రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్నారని కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనల్లో స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కోనుగోలు చేసింది. అలాగే భద్రాద్రి, వేదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చేసింది. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని కీలకంగా వ్యవహరించిన అధికారులకు నోటీసులు జారీ చేసింది. వారంతా కమిషన్ ఎదుట హాజరయ్యారు. అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం సదరు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన మాత్రం ఈ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. అంతేకాదు... ఈ కమిషన్ ఏర్పాటుపై కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందులోభాగంగా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 01:52 PM

Advertising
Advertising
<