ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: భార్యను కడతేర్చిన భర్త

ABN, Publish Date - Aug 02 , 2024 | 07:57 AM

అనుమానం పెనుభూతమై కుటుంబాలను సర్వనాశనం చేస్తోంది. 17 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత కూడా భార్యపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అంతే నిత్యం ఇంట్లో గొడవలు.

అనుమానం పెనుభూతమై కుటుంబాలను సర్వనాశనం చేస్తోంది. 17 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత కూడా భార్యపై అనుమానం పెంచుకున్నాడో భర్త. అంతే నిత్యం ఇంట్లో గొడవలు.. ఇక గత రాత్రి ఆమెను రాడ్డుతో తలపై కొట్టి చంపేశాడు. ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆమె అనంత లోకాలకు.. అతను జైలుకు.. వీరికి ఒక పాప ఉంది. ఆమె అనాథగా మిగిలిపోయింది. కుటుంబం మొత్తం విచ్ఛిన్నమైపోయింది. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలులో జరిగింది.


నాగర్‌కర్నూలు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇనుపరాడుతూ తలపై కొట్టి హత్య చేశాడు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రాజు కు జ్యోతి (35) తో 17 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఓక కూతురు ఉంది కూతురు తో కలిసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రాజు హత్య చేసి అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్య కేసు నమోదు చేసుకొని మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రాయదుర్గం మల్కం చెరువు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంది హిల్స్ నుంచి వేగంగా వచ్చి మార్కం చెరువు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని వేగంగా కారు ఢీ కొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న యువకుడు స్పాట్ లో మృతి చెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతుడు ఇక్‌ఫై యూనివర్సిటీ లో బీబీఏ చదువుతున్న విద్యార్థి చరణ్(19)గా గుర్తించారు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 02 , 2024 | 08:04 AM

Advertising
Advertising
<