Telangana: స్టెరిలైట్‌లో టీ ఫైబర్ ఎంవోయూ
ABN, Publish Date - Oct 16 , 2024 | 08:05 PM
టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఆ క్రమంలో అనేక టెలికాం సంస్థల ప్రతినిధులతో తాము సమావేశమై చర్చించామన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా.. ప్రత్యేకంగా టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని రాష్ట్రాలు నిర్ణయం చేయవచ్చంటూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తెలియ జేయడం జరిగిందని చెప్పారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: స్టెరిలైట్ కంపెనీతో టీ ఫైబర్ ఎంవోయు కుదుర్చుకుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దీని వల్ల వందలాది మంది యువత శిక్షణ పొందబోతున్నారని తెలిపారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారు.. టెలికాం రంగంలో ఉపాధి లభిస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆసియాలోనే బిగ్గెస్ట్ టెక్ ఇవెంట్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2024 సదస్సును మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Also Read: Sajjala: నోటీసులపై స్పందిస్తూ.. జత్వానీ పేరు ఎత్తిన సజ్జల
ఈ సదస్సుకు హాజరైన ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు బుధవారం మాట్లాడుతూ... టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఆ క్రమంలో అనేక టెలికాం సంస్థల ప్రతినిధులతో తాము సమావేశమై చర్చించామన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా.. ప్రత్యేకంగా టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని రాష్ట్రాలు నిర్ణయం చేయవచ్చంటూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తెలియ జేయడం జరిగిందని చెప్పారు.
Also Read: Viral Video: వంటింటిలో కెమెరా.. అడ్డంగా దొరికిపోయిన రీనా..
మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా తీసుకొని.. విధానపర నిర్ణయం తీసుకొని పాలసీని ఇనిషియేట్ చేస్తామన్నారు. దీని వల్ల అనేక టెలికాం మ్యానుఫ్యాక్చరర్స్ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అతి త్వరలో దీనిని తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటామన్నారు. ఐటీ శాఖల మంత్రి జ్యోతిరాధిత్య సిందియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఐటీ మినిస్టర్ల కాన్ఫరెన్స్‌లో తాము పాల్గొన్నట్లు తెలిపారు.
Also Read: Chandra Mangal Yuti: మరికొద్ది రోజుల్లో ఈ మూడు రాశుల వారికి బంగారు యోగం..
ప్రభుత్వం తరఫున టీ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌కు సంబంధించి గ్రామంలోని ప్రతి ఇంటికి నెట్‌వర్క్ సదుపాయం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్బంగా వారికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. 2014 అనంతరం భారత నెట్ అని ఫేస్ టు ఫేస్ వన్ అని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. రూ. 3 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసుకొని అండర్ గ్రౌండ్‌లో ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Also Read: Telangana: గుండు సున్నా చేసిన సీఎం రేవంత్ రెడ్డి
అండర్ గ్రౌండ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకత అని ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు వివరించారు. ఈ నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే నిధులు అవసరమన్నారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. దాదాపు రూ. 1600 కోట్లకు పైగా నిధులు అవసరమని.. వాటిని తెలంగాణాకు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
Also Read: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుంది.. జస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి..!
గతంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారని గుర్తు చేశారు. అటవీ ప్రాంతాలకు సంబంధించి ఫైబర్ నెట్‌వర్క్ కోసం అటవీ శాఖా అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఈ అనుమతుల అంశాన్ని కేంద్రం పరిష్కారం చేయాలని తాము కేంద్రాన్ని కోరామన్నారు. దీనిపై కేంద్రం సైతం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.
మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు 190 దేశాల ప్రతినిధులు, 3 వేల మంది పారిశ్రామికవేత్తలు, 400 మందికి పైగా ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అలాగే తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు దాదాపు 900 స్టార్టప్ కంపెనీలు 120 దేశాల నుంచి తరలి వచ్చాయి. ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ సదస్సుకు 10 మంది ప్రతినిధుల బృందంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అలాగే ఈ సదస్సుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్యాపిటల్ పార్ట్‌నర్‌గా తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తుంది.
For Telangana News And Telugu News...
Updated Date - Oct 16 , 2024 | 08:06 PM