ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ‘ప్రజావాణి’తో సత్ఫలితాలు

ABN, Publish Date - Nov 17 , 2024 | 03:34 AM

రాష్ట్రంలోని పేదల వాణి విని.. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ సత్ఫలితాలను ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

  • పేద బాలిక ఆరోగ్య సమస్యపై స్పందించి సత్వర వైద్యం

  • అధికారులకు సీఎం అభినందనలు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్వీట్‌ చేసిన రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదల వాణి విని.. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ సత్ఫలితాలను ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదబాలిక బిస్మిల్లా బీ ఆరోగ్య సమస్యపై సత్వరం స్పందించి, మెరుగైన వైద్యం అందించి ఆమె ప్రాణాలు నిలబెట్టిన ప్రజావాణి అధికారులను ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు. బిస్మిల్లా బీ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. బిస్మిల్లా, తల్లి జూమన్‌ బీకి శుభాకాంక్షలు తెలిపారు.


బిస్మిల్లా బీ ప్రజావాణిని ఆశ్రయించడం.. ఆమెకు అధికారులు చికిత్స చేయించడంపై ‘మా అమ్మాయికి చికిత్స చేయించండి’ అన్న శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనాన్ని కూడా ఈ సందర్భంగా సీఎం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Updated Date - Nov 17 , 2024 | 03:34 AM