ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Revanth Reddy: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

ABN, Publish Date - Aug 05 , 2024 | 03:47 PM

అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేరును ప్రకటించారు.

Anand Mahindra

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేరును ప్రకటించారు. ఆనంద్ మహీంద్రాను ఈ మేరకు నియమించబోతున్నట్టు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.


కాగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్కిల్‌ వర్సిటీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగింది. వర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెట్టి, ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యువత వద్ద కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందనే విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. పోటీ ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోంది. యూనివర్సిటీలో యువతకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించనున్నారు.


ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వర్సిటీ నిర్వహణ..

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్వహించనున్నారు. సర్టిఫికెట్‌ కోర్సులను మూడు రకాలుగా అందించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న స్కిల్‌ వర్సిటీలో డిగ్రీ పట్టా ఇవ్వాలని నిర్ణయించారు. ఫీజు ఏడాదికి రూ.50 వేలుగా నిర్ణయించినట్టు ప్రభుత్వం అసెంబ్లీలో పేర్కొంది. ఇక రీయింబర్స్‌మెంట్‌, హాస్టల్‌ వసతి కల్పిస్తామని తెలిపింది. తాత్కాలికంగా హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో 1500 మందికి, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (నాక్‌)లో 500 మందికి 6 కోర్సుల్లో తరగతులు ప్రారంభిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆ తర్వాత క్రమక్రమంగా యూనివర్సిటీని భవిష్యత్తులో జిల్లాలకూ విస్తరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు కాబట్టి వీలైనన్ని అవకాశాలను కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఇందుకోసం త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన విషయం తెలిసిందే. ఆరోగ్యం, ఔషధాలు, కృత్రిమ మేధ, లైఫ్‌ సెన్సెస్‌, బ్యాంకింగ్‌, యానిమేషన్‌ వంటి 12 రంగాలకు చెందిన బోధన ఉంటుందన్నారు. వర్సిటీ కోసం ముచ్చర్లలో 57 ఎకరాల భూమిని కేటాయించామని, అక్కడ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటవుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 05 , 2024 | 03:47 PM

Advertising
Advertising
<