ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: ‘కులగణన’లో భాగస్వాములు కండి

ABN, Publish Date - Oct 31 , 2024 | 03:18 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణనలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు.

  • ఉపాధ్యాయులకు డిప్యూటీ సీఎం పిలుపు

  • సచివాలయంలో సంఘాల నేతలతో భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణనలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కుల గణన కార్యక్రమంలో పాలుపంచుకోవడంపై సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఎన్నికల హామీల అమలులో భాగంగా కుల గణన చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.


ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరినట్లు ఉదయం వేళల్లో సర్వే నిర్వహించడం, నవంబరు 9 నుంచి 15 వరకు వరుస సెలవుల మధ్య సర్వే చేపట్టడం, సెలవు రోజుల్లో సర్వేలో పాల్గొనే టీచర్లకు పరిహారంతో కూడిన సెలవులు(సీసీఎల్‌) మంజూరు చేయడం, సర్వేపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్న సూచనలన్నింటినీ ఆచరణలో పెడతామని భట్టి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కోరుకున్న విధంగా సర్వే చేయడానికి ఉపాధ్యాయ లోకం సిద్ధంగా ఉందని ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షౌకత్‌ అలీ తెలిపారు. ఉపాధ్యాయులైతేనే సర్వే బాగా చేస్తారన్న నమ్మకం ఉంచినందుకు పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.


సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు పరిహారంతో కూడిన సెలవును మంజూరు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరారు. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులకు స్పెషల్‌ లీవ్‌తో పాటు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని డీటీఎఫ్‌ అధ్యక్షుడు లింగారెడ్డి కోరారు. ఆదివాసీ ఉపాధ్యాయ సంఘాన్ని కూడా ఆహ్వానించడం పట్ల ఆ సంఘం అధ్యక్షుడు రవి ధన్యవాదాలు తెలిపారు. , కుల గణన సర్వేలో సంపూర్ణంగా సహకరిస్తామని యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ తమను పిలిపించుకొని మాట్లాడుతోందని మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య పేర్కొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 03:18 AM