ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DISCOMs: కొత్త లైన్ల వ్యయం వినియోగదారుల నుంచే వసూలు!

ABN, Publish Date - Oct 18 , 2024 | 03:22 AM

కొత్తగా విద్యుత్తు సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కరెంట్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే చార్జీల మోత మోగనుంది..

  • దరఖాస్తుదారుల నుంచే రాబట్టుకోవాలని డిస్కమ్‌ల నిర్ణయం

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): కొత్తగా విద్యుత్తు సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కరెంట్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే చార్జీల మోత మోగనుంది.. కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఆ లైన్లు వేయడానికి అవసరమైన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవాలని తెలంగాణ డిస్కమ్‌లు యోచిస్తున్నాయి. ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)ని కోరాయి. 2020 డిసెంబరు 31న ఎలక్ట్రిసిటీ రూల్స్‌ ప్రకారం వినియోగదారులకు విద్యుత్తును అందించడానికి వీలుగా 150 కిలోవాట్ల లోపు లేదా ఆ పైన లోడు కోసం కొత్తగా సరఫరా వ్యవస్థకు వెచ్చించిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవాలని కేంద్ర విద్యుత్తు శాఖ డిస్కమ్‌లకు ఆదేశాలిచ్చిన విషయం విదితమే.


ఈ నేపథ్యంలోనే 2013లో కమిషన్‌ జారీ చేసిన రెగ్యులేషన్‌-4ను సవరించాలని డిస్కమ్‌లు ఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశాయి. దాంతో ఈ ముసాయిదా రెగ్యులేషన్‌ సవరణపై ఈనెల 24లోగా అభిప్రాయాలు/అభ్యంతరాలు తెలపాలంటూ గురువారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దాంతో కొత్తగా విద్యుత్తు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించిన ప్రాంతాల్లో కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి నుంచి సర్వీస్‌ లైన్‌ చార్జీలను కిలోవాట్‌ లోడ్‌ ఆధారంగా డిస్కమ్‌లు వసూలు చేయనున్నాయి.


  • సర్వీస్‌ లైన్‌ చార్జీల ప్రతిపాదనలు..

డొమెస్టిక్‌, వాణిజ్య, పరిశ్రమల విభాగాల్లో ఒక కిలోవాట్‌ వరకు ఎటువంటి చార్జీలు లేవు. ఒక కిలోవాట్‌ నుంచి 3 కిలోవాట్ల దాకా.. డొమెస్టిక్‌లో రూ.100, నాన్‌ డొమెస్టిక్‌లో రూ.110, పరిశ్రమలకు రూ.120గా ప్రతిపాదించారు. 3- 5 కిలోవాట్ల దాకా.. డొమెస్టిక్‌లో 3 కిలోవాట్లకు రూ.300.. ఆపైన కిలోవాట్‌కు 150, నాన్‌ డొమెస్టిక్‌లో 3 కిలోవాట్లకు రూ.330.. ఆపైన 165, పరిశ్రమలకు 3 కిలోవాట్లకు రూ.360.. ఆపైన రూ.180గా పేర్కొన్నారు. 5 కిలోవాట్ల నుంచి 15 కిలోవాట్ల దాకా.. డొమెస్టిక్‌లో 5 కిలోవాట్లకు 600, ఆపైన రూ.200, నాన్‌డొమెస్టిక్‌లో 5 కిలోవాట్లకు రూ.660.. ఆపైన రూ.220, పరిశ్రమలకు 5 కిలోవాట్లకు రూ.720, ఆపైన రూ.240గా నివేదించారు.


15 కిలోవాట్ల నుంచి 56 కిలోవాట్ల దాకా.. డొమెస్టిక్‌లో 15 కిలోవాట్లకు రూ.2,600.. ఆపైన కిలోవాట్‌కు రూ.250, నాన్‌డొమెస్టిక్‌లో 15 కిలోవాట్లకు రూ.2,860, ఆపైన రూ.250, పరిశ్రమలకు 15 కిలోవాట్లకు రూ.3,120, ఆపైన కిలోవాట్‌కు రూ.360గా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 56 కిలోవాట్ల నుంచి 75 కిలోవాట్ల దాకా.. పరిశ్రమల విభాగంలో 15 కిలోవాట్లకు రూ.15,420, ఆపైన కిలోవాట్‌కు రూ.360, 75 కిలోవాట్ల నుంచి 93 కిలోవాట్ల దాకా పరిశ్రమలకు 75 కిలోవాట్లకు 22,260, ఆపైన కిలోవాట్‌కు రూ.432గా నిర్ణయించారు.

Updated Date - Oct 18 , 2024 | 03:22 AM