ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Corn Farmers: మొక్కజొన్నకు దిక్కేది..?

ABN, Publish Date - Oct 18 , 2024 | 03:49 AM

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు దళారులను

  • కొనుగోలు కేంద్రాలు తెరవని మార్క్‌ఫెడ్‌

  • మార్కెట్‌కు చేరుతున్న పంట..

  • రూ.150 వరకు ధర తగ్గిస్తున్న దళారులు

  • తరుగు పేరిట కోత.. తూకంలోనూ దగా

జగిత్యాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో మార్క్‌ఫెడ్‌ కేంద్రాలను తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే అదనుగా దళారులు ధరలు తగ్గించి రైతులను దగా చేస్తున్నారు. ఈ సీజన్‌లో అధిక వర్షాలతో కష్టాల్లో ఉన్న రైతులను ఈ పరిణామం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.


  • పతనమవుతున్న ధర:

మక్కలు క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,225గా ఉంది. ప్రైవేటు వ్యాపారులు రూ.2,100 నుంచి రూ. 2,150 వరకు చెల్లిస్తున్నారు. తరుగు పేరిట క్వింటాలుకు సుమారు నాలుగు కిలోల వరకు కోత పెడుతున్నారు. అలాగే క్యాష్‌ కటింగ్‌ పేరిట రెండు శాతం కోత, తూకాల్లో సైతం మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇప్పుడిప్పుడే మక్కలు మార్కెట్‌కు వస్తున్నాయి. జిల్లాలో వారం, పది రోజుల క్రితం వరకు మొక్కజొన్న క్వింటాలుకు రూ. 2,300 వరకు పలికింది. పంట చేతికి వస్తున్న సమయంలో ధరలు పతనమవుతు న్నాయి. వ్యాపారుల మాయాజాలం వల్లే ధరలు తగ్గుతున్నాయని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు జరిపించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ విషయమై జగిత్యాల జిల్లా మార్క్‌ఫెడ్‌ డీఎం ఎండీ హబీబ్‌ను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే జిల్లాలో ఎక్కడైతే మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.


  • ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవాలి

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పండించిన మొక్కజొన్న కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కేంద్రాలు తెరవాలి. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మార్కెట్‌లో దళారులు ధరలు తగ్గించడంతో పాటు క్యాష్‌ కటింగ్‌, తేమ పేరుతో ధర తగ్గింపు, తూకంలో హెచ్చు తగ్గులు వంటి అవకతవకలకు పాల్పడుతున్నారు.

- నల్లాల ఆదిరెడ్డి, మొక్కజొన్న రైతు, ఆలూరు గ్రామం, జగిత్యాల జిల్లా

Updated Date - Oct 18 , 2024 | 03:49 AM