ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: మేము వచ్చాక 54,573 పోస్టుల భర్తీ

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:10 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత నుంచి 55,172 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి, 54,573 పోస్టులను భర్తీ చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

  • జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే నియామకాలు: భట్టి

హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత నుంచి 55,172 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి, 54,573 పోస్టులను భర్తీ చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని, ఇకపై ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం దశల వారీగా భర్తీ చేస్తామన్నారు. మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానం చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్‌-1లో 563 పోస్టులకు పరీక్ష నిర్వహించినట్టు చెప్పారు. 11,062 ఖాళీలతో డీఎస్సీ నిర్వహించి 10,600 మందికి నియామక ఉత్తర్వులు ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగ పరీక్షలన్నీ ఎలాంటి లీక్‌లు లేకుండా.. పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ‘డీ’ రిజర్వేషన్‌ విధానానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.

Updated Date - Dec 17 , 2024 | 04:10 AM