ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti: తొలి విడత 40 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం

ABN, Publish Date - Oct 06 , 2024 | 03:26 AM

రాష్ట్రంలో ఎంపిక చేసిన 40 నియోజకవర్గాల్లో తొలి విడతగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

  • ఒక్కోటి పాతిక ఎకరాల్లో.. స్థలాలను గుర్తించిన ప్రభుత్వం

  • 5 వేల కోట్ల వ్యయం.. నేడు వెల్లడించనున్న రేవంత్‌, భట్టి

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంపిక చేసిన 40 నియోజకవర్గాల్లో తొలి విడతగా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వాటి నిర్మాణానికి స్థలాల గుర్తింపు పూర్తిచేసింది. రూ.5వేల కోట్లతో చేపట్టే ఈ స్కూళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి ఆదివారం ప్రకటించనున్నారు.


ఏయే నియోజకవర్గాల్లో తొలి విడతగా ఈ స్కూళ్లను నిర్మిస్తారు, ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తారు.. ఏర్పాటు ఉద్దేశం తదితర వివరాలను వారు వెల్లడించనున్నారు. ఒక్కో స్కూలును పాతిక ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు, ఆయా స్కూళ్లకు అంగన్‌వాడీ, ఇతర స్కూళ్లనూ అనుసంధానం చేయనున్నట్లు గతంలోనే ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.

Updated Date - Oct 06 , 2024 | 03:26 AM