ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హుజూరాబాద్‌లో వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి !

ABN, Publish Date - Dec 01 , 2024 | 04:36 AM

వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరీంనగర్‌ జిల్లాలోని హూజురాబాద్‌ వద్ద చెత్త నుంచి విద్యుత్‌ తయారుచేసే ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.

  • 6 మెగావాట్ల సామర్థ్యంతో 25 ఎకరాల్లో ప్లాంట్‌ ఏర్పాటు

  • త్వరలోనే టెండర్ల ప్రక్రియ

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరీంనగర్‌ జిల్లాలోని హూజురాబాద్‌ వద్ద చెత్త నుంచి విద్యుత్‌ తయారుచేసే ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. రూ.150 కోట్ల వ్యయంతో 25 ఎకరాల స్థలంలో 6 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను నెలకొల్పాలని చూస్తోంది. ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించేందుకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, హనుమకొండ, కరీంనగర్‌ కలెక్టర్లు చర్చించుకుని హుజూరాబాద్‌ వద్ద ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అంతేకాక ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కరీంనగర్‌ కలెక్టర్‌ ఇప్పటికే హుజూరాబాద్‌ కమిషనర్‌కు అప్పగించారు. మరోపక్క, రోజుకు 790 టన్నుల చెత్త నుంచి 6 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన అధ్యయనాన్ని సంబంధిత అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.


ఇందుకోసం జవహర్‌నగర్‌తోపాటు ఏపీలోని గుంటూరులో ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను సందర్శించారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌కు ప్రతి రోజు హుజూరాబాద్‌ మున్సిపాలిటీ నుంచి 19.74 టన్నుల చెత్త చేరనుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, జమ్మికుంట నుంచి 18.64 టన్నులు, హసన్‌బాద్‌ నుంచి 9.32, పరకాల నుంచి 10.32, వరంగల్‌ నుంచి 518.62, కరీంనగర్‌ నుంచి 186.07, కొత్తపల్లి 4.67, వర్థన్నపేట 5.79, నర్సంపేట్‌ 15.64 టన్నుల చెత్తను విద్యుత్‌ ప్లాంట్‌కు తరలిస్తారు. ఈ చెత్త ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను యూనిట్‌ రూ.6.80పైసల చొప్పున జెన్‌కోకు విక్రయించాలని ప్రణాళికలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒప్పందం చేసుకునేందుకు పురపాలక శాఖ నుంచి వలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఛైర్మన్‌కు, జెన్‌కో ఎండీకి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి.

Updated Date - Dec 01 , 2024 | 04:36 AM