ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Exam Attendance: గ్రూప్‌-3 పరీక్షకు 50% హాజరు

ABN, Publish Date - Nov 18 , 2024 | 03:38 AM

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. మొదటి పేపర్‌కు 51ు, రెండో పేపర్‌కు 50 శాతం మంది హాజరైనట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

  • హైదరాబాద్‌లో 41% మంది హాజరు

  • ఆలస్యంగా వచ్చినవారికి నో ఎంట్రీ

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి)ః రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. మొదటి పేపర్‌కు 51%, రెండో పేపర్‌కు 50 శాతం మంది హాజరైనట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. మొదటి పేపర్‌కు 2.73 లక్షల మంది, రెండో పేపర్‌కు 2.72 లక్షల మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 64.5%, హైదరాబాద్‌లో అత్యల్పంగా 41% మంది హాజరైనట్లు ఆయన తెలిపారు.


  • ఆలస్యం... అనుమతి నిరాకరణ

రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని శ్రీదత్త ఇంజినీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రానికి నలుగురు అభ్యర్థులు 9.30 తర్వాత చేరుకున్నారు. అధికారులు అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. వికారాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వచ్చిన 65 మంది పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. మేడ్చల్‌ జిల్లాలోని ఎన్‌ఎ్‌సఆర్‌ జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తాము ఎడిట్‌ ఆప్షన్‌లో పెట్టుకున్న విధంగా పేపర్లు ఇవ్వాలని కోరడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. జేఎన్టీయూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్దకు ఓ యువతి పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో స్పృహ తప్పే పరిస్థితికి చేరింది. అక్కడే విధులు నిర్వరిస్తున్న ఎస్‌బీ ఏఎస్సై వెంకట్రాములు గమనించి, ఆమెను జాగ్రత్తగా లోనికి తీసుకెళ్లారు. మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు నీరు తాగించి, తేరుకున్నాక పరీక్ష కేంద్రంలోకి పంపించారు. ఒక పరీక్ష కేంద్రానికి బదులు మరో పరీక్ష కేంద్రానికి వచ్చిన యువతిని ట్రాఫిక్‌ హెడ్‌కానిస్టేబుల్‌ తన వాహనంపై తీసుకెళ్లి వదిలిపెట్టారు.


  • ఆలస్యమైనా అనుమతించారు

నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన భార్యాభర్తలు గ్రూప్‌-3 పరీక్ష రాయాల్సి ఉండగా, భార్యకు అనుమతి నిరాకరించగా, ఐదు నిముషాలు ఆలస్యంగా వెళ్లిన భర్తను లోపలికి అనుమతించారు. విజయ్‌కుమార్‌ తన భార్య దీపికను నర్సిరెడ్డి డిగ్రీ కళాశాల కేంద్రం వద్ద 9.30కు వదిలిపెట్టి కిలోమీటరు దూరంలో తనకు కేటాయించిన కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే 9.30 దాటినా, అధికారులు ఆయనను అనుమతించారు. డిగ్రీ కళాశాల వద్ద విజయ్‌కుమార్‌ భార్యను మాత్రం లోనికి అనుమతించలేదు.

Updated Date - Nov 18 , 2024 | 03:38 AM