ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లెక్కల్లేకుండా.. మార్గదర్శకాలు!

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:53 AM

సరైన అధ్యయనాలు చేయకుండా, వినియోగంపై కచ్చితమైన లెక్కలు లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణకు మార్గదర్శకాలను (ఆపరేషన్‌ ప్రొటోకాల్స్‌) ఏపీ రూపొందించినట్టు తెలంగాణ పేర్కొంది.

  • శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఏపీ ఆపరేషనల్‌ ప్రొటోకాల్స్‌ శుద్ధ దండగ

  • కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ న్యాయవాది వాదన

  • తెలంగాణ మైనర్‌, మీడియం ఇరిగేషన్‌ అవసరాలకు రక్షణ ఉందన్న ఏపీ

  • 21న కృష్ణా బోర్డు సమావేశం

  • 11 లోపు ఎజెండా పంపించాలంటూ తెలంగాణ, ఏపీలకు లేఖ

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సరైన అధ్యయనాలు చేయకుండా, వినియోగంపై కచ్చితమైన లెక్కలు లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణకు మార్గదర్శకాలను (ఆపరేషన్‌ ప్రొటోకాల్స్‌) ఏపీ రూపొందించినట్టు తెలంగాణ పేర్కొంది. ఏపీ తయారు చేసిన ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌కు ఎలాంటి విలువలేదని తెలిపింది. అయితే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే వాటిని రూపొందించినట్టు ఏపీ పేర్కొంది. జస్టిస్‌ బ్రిజే్‌షకుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్‌-2లో గురువారం రెండో రోజు ఢిల్లీలో నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ఏపీ తరపున సాక్షిగా కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ గోయల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాది ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కేంద్రం జారీ చేసిన అదనపు విచారణ విధివిధానాలకు(టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) అనుగుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి ట్రైబ్యునల్‌ విచారణ నిర్వహిస్తోంది. ఏపీ తయారు చేసిన ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌కు ఎలాంటి విలువలేదని తెలంగాణ తరపు న్యాయవాది క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ప్రశ్నించగా... ‘అవాస్తవమని’ అనిల్‌ కుమార్‌ గోయల్‌ అన్నారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే వాటిని రూపొందించినట్టు తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టు ద్వారా నికర జలాల సరఫరా ప్రారంభమైతే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల మళ్లింపు ఉండదని గోయల్‌ స్పష్టంచేశారు. అయితే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రూ.1,300 కోట్ల పరిస్థితి ఏంటని తెలంగాణ తరఫున న్యాయవాది ప్రశ్నించగా... ‘నోకామెంట్‌’ అని గోయల్‌ బదులిచ్చారు.


తెలంగాణలో చిన్న, మధ్యతరహా నీటిపారుదల కింద 137.05 టీఎంసీల వినియోగానికి రక్షణ ఉందని ఓ ప్రశ్నకు గోయల్‌ సమాధానమిచ్చారు. కృష్ణా డెల్టా ఆయకట్టు నీటి అవసరాలు 152.2 టీఎంసీల నుంచి 132.9 టీఎంసీలకు తగ్గిపోయాయని, ప్రాజెక్టు ఆధునికీకరణ నివేదికలో పేర్కొన్న విషయం వాస్తవమే అయినా సీడబ్ల్యూసీ తుది ఆమోదం ప్రకారం 155.4 టీఎంసీలు అవసరమని గుర్తు చేశారు.

  • 21న కృష్ణా బోర్డు సమావేశం

కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం ఈనెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో జరగనుంది. దీంట్లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండాను ఈ నెల 11వ తేదీలోపు పంపించాలని తెలంగాణ, ఏపీలను బోర్డు కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే గురువారం లేఖ రాశారు. బోర్డు సమావేశంలో 2024-25 వాటర్‌ ఇయర్‌లో ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అప్పగింత గెజిట్‌పై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణను పూర్తిస్థాయిలో తమకు అప్పగించాలని, శ్రీశైలంలో ప్లంజ్‌పూల్‌ మరమ్మతులు చేయాలని, కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్‌ తుదితీర్పు వచ్చే వరకూ.. 50:50 నిష్పత్తితో పంచాలని రాష్ట్ర ప్రభుత్వం బోర్డు సమావేశంలో కోరనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 08 , 2024 | 03:54 AM