ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG High Court: ఆలయాలు వాణిజ్య సంస్థలు కాదు

ABN, Publish Date - Jul 02 , 2024 | 03:55 AM

దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.

  • ఉజ్జయిని మహంకాళి గుడి

  • నిర్వాహకులపై హైకోర్టు ఆక్షేపణ

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్వాహకుల పనితనం చూసిన తర్వాత ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయా? అన్న అనుమానం కలుగుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ ఆలయానికి చీరెలు, జాకెట్లు, కొబ్బరికాయలు సేకరించేందుకు ఎన్‌. నవీన్‌కుమార్‌ అనే వ్యక్తికి టెండర్‌ ఉంది. కొవిడ్‌వల్ల నష్టపోయిన కాలానికిగాను అందరు కాంట్రాక్టర్లకు 292 రోజుల పాటు లీజు గడువు పొడిగించాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి 2021లో నోటిఫికేషన్‌ జారీచేశారు. అయితే దీనిని పట్టించుకోకుండా మహంకాళి ఆలయ ఈవో కొత్త టెండర్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీంతో పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో లీజు గడువు పొడిగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.


చిట్కుల్‌ చెరువులో చేపల మృతిపై నోటీసులు

పటాన్‌చెరువు పరిధిలోని చిట్కుల్‌ చెరువులో టన్నులకొద్దీ చేపలు చనిపోవడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. మరోవైపు జంతులపై క్రూరత్వ నిరోధక చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడంలేదని అందిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Jul 02 , 2024 | 03:55 AM

Advertising
Advertising