ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balo Raja: భౌగోళిక పరిశోధనల్లో తెలంగాణ భేష్‌

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:51 AM

భౌగోళిక పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అరుణాచల్‌ప్రదేశ్‌ భూ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బాలో రాజా ప్రశంసించారు.

  • జియోస్మార్ట్‌ సదస్సులో అరుణాచల్‌ మంత్రి ప్రశంస

  • వాణిజ్య ఉపగ్రహ చిత్రాల సేవలకు ‘ధ్రువ’ శ్రీకారం

హైదరాబాద్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): భౌగోళిక పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అరుణాచల్‌ప్రదేశ్‌ భూ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బాలో రాజా ప్రశంసించారు. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయని పేర్కొన్నారు. జియో స్మార్ట్‌ ఇండియా-2024 జాతీయ సదస్సు సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.


ముఖ్య అతిథిగా హాజరైన బాలో రాజా మాట్లాడుతూ భౌగోళిక సమాచార రంగం నేడు ప్రపంచానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాణిజ్య ఉపగ్రహ చిత్రాల సేవలను ‘అస్త్రా వ్యూ’ పేరిట ప్రారంభిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన ‘ధ్రువ స్పేస్‌’ సంస్థ సీఈవో సంజయ్‌ నెక్కంటి తెలిపారు. ‘ఇన్‌-స్పే్‌స’ చైర్‌పర్సన్‌ పవన్‌ గోయెంకా, ‘జియోస్పేషియల్‌ వరల్డ్‌’ సీఈవో సంజయ్‌ కుమార్‌, ఐటీ శాఖ అధికారి శ్రీకాంత్‌ లంక పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 04:51 AM