ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

ABN, Publish Date - Sep 15 , 2024 | 01:09 PM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 200 మంది పోలీసులు ఆయన నివాసం వద్ద పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు భారీగా.. ఎమ్మెల్యే గాంధీ నివాసానికి తరలి వచ్చే అవకాశముందని ముందస్తు సమాచారం మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసం వద్ద ఆదివారం ఉదయం భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 200 మంది పోలీసులు ఆయన నివాసం వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు భారీగా.. ఎమ్మెల్యే గాంధీ నివాసానికి తరలి వచ్చే అవకాశముందని ముందస్తు సమాచారం మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఈ చర్యలు చేపట్టారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఆ క్రమంలో శుక్రవారం కొండాపూర్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే గాంధీ అనుచరులు ప్రయత్నించారు.


అ క్రమంలో వారి ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... కౌశిక్ రెడ్డి నివాసం కిటికి అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే ఎమ్మెల్యే గాంధీ సైతం కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గాంధీతోపాటు అనుచరులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇటీవల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరెకపూడి గాంధీ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కేటాయించాల్సిన ఆ పదవిని అరెకపూడి గాంధీకి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తున్నారు. అలాంటి వేళ అరెకపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పలు ఆరోపణలు గుప్పించారు. దీంతో ఈ ఇరువురు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు.


ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించకుంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటుందంటూ కౌశిక్ రెడ్డి.. తన ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ ప్రస్తావించారు. అందుకు కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పారు. అదీకాక పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత.. ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైందని గుర్తు చేశారు.


ఇక కౌశిక్ రెడ్డి సైతం ఎమ్మెల్యే గాంధీపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పాలనలో ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. అలా శేరిలింగపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరెకపూడి గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 16 , 2024 | 11:24 AM

Advertising
Advertising