ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Teachers: టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలి

ABN, Publish Date - Dec 10 , 2024 | 03:13 AM

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు.

  • స్కూళ్లలో వారి వివరాలు కూడా వెల్లడించాలి

  • ఆఫీసులో లేదా బడి ఆవరణలో కనిపించాలి

  • పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ

  • నకిలీ టీచర్ల సమస్యకు పరిష్కారంగానే..

  • మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు. ముఖ్యంగా, నకిలీ (ప్రాక్సీ) టీచర్ల బెడదను అరికట్టటానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్నారు. అయితే.. కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులు తమకు బదులుగా స్థానికంగా అందుబాటులో ఉండే ఇతరులను స్కూళ్లకు పంపి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారిని ప్రాక్సీ టీచర్లు అని అంటున్నారు. వీరికి నెలకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ నకిలీలతోనే పాఠాలు చెప్పిస్తూ, అసలు ఉపాధ్యాయులు మాత్రం నెలలో అడపాదడపా పాఠశాలకు వెళ్తూ మొత్తం వేతనం తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు సైతం నకిలీలు ఎవరు? అసలు ఉపాధ్యాయులు ఎవరు? అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని నివారించడానికి వీలుగా తాజా సర్క్యుల ర్‌ జారీ చేశారు.


దీని ప్రకారం.. ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికి సంబంధించిన వివరాలతో పాటు, వారి ఫొటోలను ఆఫీసు రూంలో లేదా స్కూల్‌ పరిసరాల్లోని గోడ వద్ద ప్రదర్శించాలి. ఉపాధ్యాయుడి పేరు, జాయినింగ్‌ తేదీ, రిటైర్‌మెంట్‌ తేదీ, సొంత ఊరు, ఏ సబ్జెక్టు బోధిస్తారు, పుట్టిన తేదీ వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఉపాధ్యాయుల గురించి విద్యార్థులకు తెలియటమే కాకుండా.. స్కూళ్ల తనిఖీ కోసం వచ్చే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు కూడా అక్కడి టీచర్ల వివరాలు తెలుస్తాయి. ఒక టీచర్‌కు బదులుగా ఇతరులెవరైనా వస్తున్నారా? ఆయా స్కూళ్లలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు? వారిలో రోజూ ఎంత మంది విధులకు హాజరవుతున్నారు? తదితర అంశాలపైనా స్పష్టత వస్తుంది. రాష్ట్రంలో ఇటీవలే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను నిర్వహించారు. అలాగే 10 వేలకు పైగా కొత్త ఉపాధ్యాయులను నియమించారు. బదిలీపై వచ్చిన వారితోపాటు, కొత్త ఉపాధ్యాయులను గుర్తించడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. టీచర్ల ఫొటోలు, వివరాల వెల్లడితో ఇటువంటి సమస్యలకు పరిషారం లభిస్తుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 07:18 AM